దోమ కాటుతో కరోనా వస్తుందా..? డబ్ల్యూహెచ్‌వో ఏం చెప్పింది ?
ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న కరోనా వైరస్‌పై అనేక సందేహాలు, పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా దోమకాటుతో ఒకరి నుంచి ఒకరికి కోవిడ్-19 వైరస్ వ్యాప్తిస్తుందా..? లేదా అనే సందేహాలు అనే సందేహాలు ఇంకా వెల్లడవుతూనే ఉన్నాయి. ఇటువంటి తరుణంలో..
ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న కరోనా వైరస్‌పై అనేక సందేహాలు, పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా దోమకాటుతో ఒకరి నుంచి ఒకరికి కోవిడ్-19 వైరస్ వ్యాప్తిస్తుందా..? లేదా అనే సందేహాలు అనే సందేహాలు ఇంకా వెల్లడవుతూనే ఉన్నాయి. ఇటువంటి తరుణంలో దోమలు మానవులలో కరోనా వైరస్‌ను వ్యాప్తి చేయలేవని ఇటలీకి చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఐఎస్ఎస్ శాస్త్రీయ అధ్యయనం వెల్లడించింది.
కోవిడ్-19: రక్తం పీల్చే కీటకాల ద్వారా వ్యాప్తి చెందుతుందనడానికి ఎటువంటి ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఇప్పటికే తెలిపింది. దోమలు మానవులను కరిచినప్పుడు డెంగ్యూ, కోవ్-2ను వ్యాప్తి చేయలేవని తెలిపింది. అందువల్ల, దోమ కాటు వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు లేవు. కొత్త అధ్యయనం ప్రకారం, కరోనా నుంచి కోలుకున్న 30 శాతం మంది రోగులు ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారని తేలింది. కరోనా నెగెటివ్ అయినప్పటికీ, అటువంటి రోగులు ఆరోగ్యంగా ఉండరని, ఊపిరితిత్తుల సమస్యల కారణంగా ఎప్పుడూ అలసిపోతారని నిపుణులు వెల్లడించారు. వైరస్ కట్టడికి ఖచ్చితమైన వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేంతవరకు ప్రజలంతా ఎవరికి వారుగా కోవిడ్ నిబంధనలు పాటించక తప్పదని సూచించారు.