AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వెబ్ సిరీస్‌ల్లో నటించేందుకు మెగాస్టార్ సై

మెగాస్టార్ చిరంజీవి.. వెండితెరపైనే కాకుండా వెబ్ సరీస్‌ల్లోనూ నటించేందుకు సిద్ధమవుతున్నారు. అవును వీరు విన్నది నిజమే. లాక్‌డౌన్ వల్ల ఇంటిపట్టునే ఉన్న ఆయన ఇటీవలే..

వెబ్ సిరీస్‌ల్లో నటించేందుకు మెగాస్టార్ సై
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 22, 2020 | 4:42 PM

Share

మెగాస్టార్ చిరంజీవి.. వెండితెరపైనే కాకుండా వెబ్ సరీస్‌ల్లోనూ నటించేందుకు రెడీ అన్నారు. అవును వీరు విన్నది నిజమే. లాక్‌డౌన్ వల్ల ఇంటిపట్టునే ఉన్న ఆయన ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తానే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అవకాశమొస్తే ఖచ్చితంగా వెబ్ సిరీస్‌లో నటిస్తానని పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం మాత్రం వేరే ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నానని తెలిపారు.

కాగా టాలీవుడ్‌లో చాలా మంది నటులు ఇప్పటికే పలు వెబ్ సిరీస్‌లలో నటిస్తున్నారు. ఇప్పటికే సమంత ఈ బాటలోనే నడుస్తోంది. ‘ద ఫ్యామిలీ మ్యాన్-2’లో కీలక పాత్ర పోషించింది. త్వరలో ఈ సీజన్, ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ప్రస్తుతం మెగాస్టార్ ‘ఆచార్య’లో నటిస్తున్నారు. లాక్‌డౌన్ వల్ల ఈ సినిమా చిత్రీకరణ నిలిచిపోయింది. ఇందులో కాజల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇందులో రామ్ చరణ్.. ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నాడనే వార్త అభిమానుల్లో అంచనాల్ని పెంచుతోంది.

Read More: 

సీఎం కేసీఆర్‌కు ఆర్జీవీ దిమ్మతిరిగే ఛాలెంజ్..

జగన్ ప్రభుత్వం వల్ల రూ.1400 కోట్లు వృథా.. కన్నా సంచలన వ్యాఖ్యలు

పవన్‌తో సినిమా నేను చేయలేను.. జక్కన్న సెన్సేషనల్ కామెంట్స్

ట్రాన్స్‌జెండర్లకు కేంద్రం గుడ్‌న్యూస్.. అన్ని అప్లికేషన్స్‌లోనూ..

Follow Us