రైల్వే ప్రయాణీకులకు మరో గుడ్ న్యూస్..

రైల్వేశాఖ మరో గుడ్ న్యూస్ అందించింది. ప్రత్యేక రైళ్లలో ముందస్తు రిజర్వేషన్ గడువును పెంచుతూ గురవారం కీలక ప్రకటనను జారీ చేసింది. గతంలో స్పెషల్ ట్రైన్స్ అడ్వాన్స్ రిజర్వేషన్ గడువు 30 రోజులు మాత్రమే ఉండగా.. ఇప్పుడు దాన్ని 120 రోజులకు పెంచింది. మే 12వ తేదీ నుంచి తిరిగే 30 ప్రత్యేక రాజధాని తరహ రైళ్లు, 200 ప్యాసింజర్ ట్రైన్స్‌కు ఈ రూల్ వర్తిస్తుంది. అంతేకాక ఈ రైళ్లలో పార్శిల్స్, లగేజీ బుకింగ్‌కు కూడా అనుమతిస్తున్నట్లు […]

  • Ravi Kiran
  • Publish Date - 7:29 am, Fri, 29 May 20
రైల్వే ప్రయాణీకులకు మరో గుడ్ న్యూస్..

రైల్వేశాఖ మరో గుడ్ న్యూస్ అందించింది. ప్రత్యేక రైళ్లలో ముందస్తు రిజర్వేషన్ గడువును పెంచుతూ గురవారం కీలక ప్రకటనను జారీ చేసింది. గతంలో స్పెషల్ ట్రైన్స్ అడ్వాన్స్ రిజర్వేషన్ గడువు 30 రోజులు మాత్రమే ఉండగా.. ఇప్పుడు దాన్ని 120 రోజులకు పెంచింది. మే 12వ తేదీ నుంచి తిరిగే 30 ప్రత్యేక రాజధాని తరహ రైళ్లు, 200 ప్యాసింజర్ ట్రైన్స్‌కు ఈ రూల్ వర్తిస్తుంది.

అంతేకాక ఈ రైళ్లలో పార్శిల్స్, లగేజీ బుకింగ్‌కు కూడా అనుమతిస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటనలో పేర్కొంది. జూన్ 1 నుంచి 200 స్పెషల్ ప్యాసింజర్ రైళ్లు తిరగనున్న సంగతి తెలిసిందే. ఈ రైళ్లకు సంబంధించి టికెట్ బుకింగ్ ఈ నెల 21 నుంచే ప్రారంభమైంది. కేవలం రిజర్వేషన్ బోగీలతో మాత్రమే ఈ రైళ్లు నడవనున్నాయి. ఇక కన్ఫామ్ టికెట్ ఉన్నవారినే రైల్వే స్టేషన్లలోకి అనుమతిస్తారు.

Read This: CBSE విద్యార్ధులకు గుడ్ న్యూస్.. సొంత జిల్లాల నుంచే పరీక్షలు..