తెలంగాణలో కొత్తగా 117 కరోనా పాజిటివ్ కేసులు
రాష్ట్రంలో కరోనా మహమ్మారి విస్తరిస్తోంది. రోజు రోజుకి అంతకంతకు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గురువారం కొత్తగా 117 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,215 కు చేరుకుంది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 844. కాగా కోవిడ్-19తో రాష్ట్రంలో ఇవాళ నలుగురు మృతిచెందారు. వ్యాధి కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తంగా 67 మంది చనిపోయారు. రాష్ట్రంలో కరోనా నుంచి 1,345 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. […]

రాష్ట్రంలో కరోనా మహమ్మారి విస్తరిస్తోంది. రోజు రోజుకి అంతకంతకు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గురువారం కొత్తగా 117 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,215 కు చేరుకుంది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 844. కాగా కోవిడ్-19తో రాష్ట్రంలో ఇవాళ నలుగురు మృతిచెందారు. వ్యాధి కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తంగా 67 మంది చనిపోయారు. రాష్ట్రంలో కరోనా నుంచి 1,345 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇవాళ కొత్తగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 58, రంగారెడ్డి జిల్లాలో 5, మేడ్చల్ జిల్లాలో 2 కేసులు నమోదు కాగా, సిద్ధిపేట్ జిల్లాల్లో ఒక కేసు నమోదైంది. ఇక గత 24 గంటల్లో వలస కూలీలు ఇద్దరు, విదేశాల నుంచి వచ్చినవారిలో 49 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు వలస కార్మికులు 175 మంది, సౌదీ అరేబియా నుంచి వచ్చిన వారిలో 143 మంది, ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో 30 మంది మొత్తంగా 348 మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారికి కరోనా పాజిటివ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.