TV9 Campaign Vaccinate All: వ్యాక్సిన్ కోసం ముందుగా రిజిస్టర్‌ అవసరంలేదన్న కేంద్రం.. ఇప్పటి వరకు 26 కోట్లకు పైగా టీకాల పంపిణీ

దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఇంకా వేగం పెరగాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అందరికీ వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం. టీవీ9 నినాదం.. దేశం విధానం.

TV9 Campaign Vaccinate All: వ్యాక్సిన్ కోసం ముందుగా రిజిస్టర్‌ అవసరంలేదన్న కేంద్రం.. ఇప్పటి వరకు 26 కోట్లకు పైగా టీకాల పంపిణీ
Coronavirus Vaccine In India
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 15, 2021 | 9:52 PM

India Covid 19 Vaccine: దేశవ్యాప్తంగా సెకండ్ వేవ్‌లో కోవిడ్‌ ఉధృతి తగ్గుతూ వస్తున్న నేపథ్యంలో కేసుల సంఖ్య కూడా అనూహ్యంగా దిగి వస్తున్నాయి. 72 రోజుల కనిష్టస్థాయికి చేరాయి. తాజాగా 60వేల471 కేసులు నమోదు కాగా.. ఒక్కరోజులో 2,726 మంది చనిపోయారు. మరోవైపు ఢిల్లీ ఎయిమ్స్‌ ఆధ్వర్యంలో పిల్లలపై కరోనా ట్రయల్స్‌ కొనసాగుతున్నాయి. 12 నుంచి 18 ఏళ్ల లోపు ఉన్న వారిపై ఇప్పటి వరకు ట్రయల్స్‌ ప్రక్రియ పూర్తి కాగా.. నుంచి నుంచి 6 నుంచి 12 సంవత్సరాల మధ్య ఉన్న వారికి వ్యాక్సినేషన్‌ చేయనున్నారు. మరోవైపు వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ఇంకా వేగం పెరగాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అందరికీ వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం. టీవీ9 నినాదం.. దేశం విధానం. మరి ఇప్పటి వరకు దేశంలో ఎంతో మంది వ్యాక్సినేషన్ పూర్తైంది. మరికొందరు వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని తమ వంతు కోసం ఎదురుచూస్తున్నారు.

Covid Vaccine

Covid Vaccine

దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టి ఇవాళ్టికి 151 రోజులు గడుస్తోంది. కాగా, ఇప్పటి వరకు 26 కోట్ల మందికి చేరువైంది. ఇవాళ్టి సాయంత్రం 7గంటల వరకు 25 కోట్ల 90 లక్షల ,44వేల 072 మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది. అందులో 21 కోట్ల ఒక లక్ష 66 వేల 746 మందికి మొదటి డోస్‌ అందగా.. 4 కోట్ల 88లక్షల 77 వేల 326 మందికి రెండో డోస్‌ పూర్తైంది. ఇవాళ ఒక్కరోజే ఇప్పటి వరకు 39 లక్షల 27 వేల 154 మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయింది.

ఇక ఏ కంపెనీ వ్యాక్సిన్లు ఎన్ని అందాయనే వివరాలు గమనిస్తే.. 22 కోట్ల 43 లక్షల 88 వేల 221 మందికి covisheild అందితే.. 3 కోట్ల 8 లక్షల 90 వేల 219 మందికి covaxine వ్యాక్సిన్లు అందాయి.

18 ఏళ్ల పై బడిన వారంతా వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. దేశంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి సంఖ్య 28 కోట్ల 85 లక్షల 35 వేల 508 మంది వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందులో 12 కోట్ల 20 లక్షల 47 వేల 492 మంది.. 18 నుంచి 44 ఏళ్ల మధ్య గ్రూప్ వారు అయితే.. 16 కోట్ల 64 లక్షల 88 వేల 16 మంది 45 ఏళ్ల పై బడిన వారు. మరోవైపు, 18-44 వయసు కలిగిన వారు ఇప్పటివరకు 4 కోట్ల 58 లక్షల మంది వ్యాక్సిన్ వేయించుకున్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

ఇక, దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగం పెంచేందుకు తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. వ్యాక్సిన్‌ కోసం ముందుగా ఎవరూ రిజిస్టర్‌ చేసుకోవాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. 18 ఏళ్లు దాటినవారెవరైనా దగ్గర్లోని వ్యాక్సినేషన్‌ కేంద్రానికి వెళ్లి అప్పటికప్పుడు కొవిన్‌ యాప్‌లో నమోదు చేసి వ్యాక్సిన్‌ వేయించుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ ప్రకటన విడుదల చేసింది. టీకా కోసం ముందుగా ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్‌ తీసుకోవడం వల్ల వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు కేంద్రం దృష్టికి రావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మరోవైపు దేశంలో వ్యాక్సిన్‌పై అనుమానాలతో చాలా ప్రాంతాల్లో టీకా వేయించుకునేందుకు ప్రజలు ముందుకు రావడం లేదని, దీనిపై శాస్త్రీయ విధానం ద్వారా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని కేంద్రం అభిప్రాయపడింది. ఈ మేరకు ‘ కొవిడ్‌ 19 వ్యాక్సినేషన్ కమ్యూనికేషన్‌ స్ట్రాటజీ’ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు అందించింది.

Covid Vaccine

Covid Vaccine

18 ఏళ్లు దాటిన వారికి ముందస్తు రిజిస్ట్రేషన్‌ లేకుండా వ్యాక్సిన్‌ విధానాన్ని కేంద్రం ఇది వరకే ప్రారంభించినప్పటికీ ఫలితాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి. అత్యుత్తమ ఆరోగ్య విధానాలు అమల్లో ఉన్న తమిళనాడులోనూ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. అత్యధిక టీకాలు ఇచ్చే రాష్ట్రాల జాబితాలో చివరి ఐదుస్థానాల్లో ఉంది. 18-44 ఏళ్ల మధ్య వారికి వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్‌ను పూర్తి చేసి.. కొవిడ్‌ నిబంధనలను సడలించినట్లయితే దేశం ఆర్థికంగా పుంజుకునేందుకు మార్గం సుగమమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.=

Tv9 Campaign Vaccinate All

Tv9 Campaign Vaccinate All

అందరికీ వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం.. ఈ సంకల్పంతోనే తెలుగు ప్రజల్లో వ్యాక్సినేషన్ పై అవగాహన కల్పిస్తోంది టీవీ9. వ్యాక్సినేషన్ పై అపోహలను తొలగించడం ద్వారా ప్రజలను ముందుకు వచ్చేలా చేయడమే టీవీ9 విధానం.. నినాదం..

Read Also…. వ్యాక్సినేషన్ కి ఇక ‘కోవిన్’ పై ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాదు….కేంద్రం స్పష్టీకరణ