India Corona Cases: దేశంలో కొత్త‌గా 62,480 క‌రోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మ‌ర‌ణాల సంఖ్య ఇలా

ఇండియాలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. కొత్త‌గా 62,480 క‌రోనా బారిన‌ప‌డ్డారు. కాగా 24 గంట‌ల వ్య‌వ‌ధిలో మ‌రో 1,587 మంది క‌రోనా కార‌ణంగా ప్రాణాలు విడిచారు.

India Corona Cases: దేశంలో కొత్త‌గా 62,480 క‌రోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మ‌ర‌ణాల సంఖ్య ఇలా
India Corona Updates
Follow us

|

Updated on: Jun 18, 2021 | 10:02 AM

ఇండియాలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్త కేసులు అదుపులోనే ఉంటున్నాయి. కొత్త‌గా గురువారం 19,29,476 మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 62,480 క‌రోనా బారిన‌ప‌డ్డ‌ట్లు తేలింది. క్రితం రోజుతో పోల్చితే కొత్త కేసుల్లో తగ్గుదల కనిపించింది. కాగా 24 గంట‌ల వ్య‌వ‌ధిలో మ‌రో 1,587 మంది క‌రోనా కార‌ణంగా ప్రాణాలు విడిచారు. మ‌ర‌ణాల సంఖ్య త‌గ్గ‌డం కాస్త ఊర‌ట‌నిచ్చే విష‌యం. మ‌రో 88,977 మంది వైర‌స్ బారి నుంచి కోలుకున్నారు. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా 7,98,656 యాక్టివ్ కేసులున్నాయి. కాగా 73 రోజుల త‌ర్వాత యాక్టివ్ కేసులు 8 ల‌క్ష‌ల దిగువ‌కు వ‌చ్చాయి. క్రియాశీల రేటు 2.78 శాతానికి చేరగా.. రికవరీ రేటు 95.93 శాతానికి పెరిగింది. కాగా 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్త‌గా 32,59,003 వ్యాక్సిన్ అందించారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం వ్యాక్సిన్ వేయించుకున‌వారి సంఖ్య 26,89,60,399 కు చేరింది.

దేశంలో మొత్తం క‌రోనా కేసులు: 2,97,62,793 మొత్తం రిక‌వ‌రీలు: 2,85,80,647 మొత్తం మ‌ర‌ణాల సంఖ్య : 3,83,490

‘మూడో దశ ప్రభావం పిల్లలపై ఉండదు’

కరోనా థ‌ర్డ్ వేవ్ వచ్చినా.. అది చిన్నారులపై ప్రభావం చూపే అవకాశాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యూహెచ్​ఓ), ఎయిమ్స్ సంయుక్త అధ్యయనం స్పష్టం చేసింది. చిన్నారులు, వయోజనుల్లో సీరో పాజిటివిటీ రేటు.. కాస్త దగ్గరగా ఒకే స్ధాయిలో ఉందని వెల్ల‌డించింది. ఈ అధ్యయనంలో భాగంగా.. ఈ ఏడాది మార్చి 15 నుంచి జూన్10 మధ్య దేశంలోని అయిదు ప్రాంతాల్లో రెండేళ్ల వయసు నుంచి వయోజనుల వరకు…. 4 వేల 59 శాంపిల్స్ సేకరించారు. పూర్తి స్ధాయి అధ్యయనం ఇంకా కొనసాగుతున్నా.. ఇప్పటి వరకు గుర్తించిన వివరాలను నిపుణులు వెల్లడించారు. సీరో పాజిటివిటీ రేటు 18 ఏళ్ల లోపు వారిలో 55.7శాతం, అంతకంటే ఎక్కువ వయసున్న వారిలో.. 63.5శాతం ఉందని వివ‌రించారు. ఇన్నాళ్లూ వయోజనుల స్థాయిలోనే పిల్లల్లోనూ కరోనా ప్రభావం చూపిందని దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చన్నారు. కరోనా థ‌ర్డ్ వేవ్ వస్తే.. ప్రత్యేకంగా చిన్నారుల్లో ప్రభావం చూపిస్తుందనే ఆందోళన అవసరం లేదని తెలిపారు.

Also Read: ‘తన భర్తను విడిచిపెట్టి, వేరే వ్య‌క్తితో స‌హ‌జీవ‌నం’.. ర‌క్ష‌ణ కావాలంటూ పిటిష‌న్ వేసిన మహిళ‌కు కోర్టు ఫైన్

 ఒకేసారి ఇద్దరినీ ప్రేమించాడు.. ఒకేసారి ఇద్ద‌రినీ పెళ్లాడాడు..

టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..
ఉల్లి రసంలో వీటిని కలిసి అప్లై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం
ఉల్లి రసంలో వీటిని కలిసి అప్లై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం
ఈ ఒక్క పండు తింటే చాలు.. ఎన్నో రోగాలకు చెక్‌ పెట్టొచ్చు..!
ఈ ఒక్క పండు తింటే చాలు.. ఎన్నో రోగాలకు చెక్‌ పెట్టొచ్చు..!
సౌందర్యకు డబ్బింగ్ చెప్పింది ఈమె..
సౌందర్యకు డబ్బింగ్ చెప్పింది ఈమె..
ఈ పువ్వుతో నిమిషాల్లో మీ తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది
ఈ పువ్వుతో నిమిషాల్లో మీ తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది
కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!
పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..
పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..