Telangana: ఒకేసారి ఇద్దరినీ ప్రేమించాడు.. ఒకేసారి ఇద్ద‌రినీ పెళ్లాడాడు..

ఆదిలాబాద్​ జిల్లాలో వింత పెళ్లి వెలుగులోకి వ‌చ్చింది. ఒకే మండపంలో ప్రేమించిన ఇద్ద‌రు యువ‌తుల‌ను పెళ్లాడాడు ఓ యువ‌కుడు. ఆ ఇద్ద‌రు....

Telangana:  ఒకేసారి ఇద్దరినీ ప్రేమించాడు.. ఒకేసారి ఇద్ద‌రినీ పెళ్లాడాడు..
Man Marries 2 Women
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 18, 2021 | 7:20 AM

ఆదిలాబాద్​ జిల్లాలో వింత పెళ్లి వెలుగులోకి వ‌చ్చింది. ఒకే మండపంలో ప్రేమించిన ఇద్ద‌రు యువ‌తుల‌ను పెళ్లాడాడు ఓ యువ‌కుడు. ఆ ఇద్ద‌రు యువ‌తుల‌తో పాటు వారి కుటుంబ స‌భ్యులు.. గ్రామ పెద్ద‌లు నుంచి కూడా అనుమ‌తి ల‌భించ‌డంతో ఊరందరి ముందే ఈ తంతు సాఫీగా జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళ్తే.. ఉట్నూర్ మండలం ఘనపూర్​కు చెందిన అర్జున్, ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటున్నారు. ఈ సమయంలోనే తన మేనత్తల కూతుళ్లను ప్రేమించాడు. ఉషారాణిది అదే గ్రామం కాగా.. సూర్యకళది శంభుగూడెం. మూడేళ్లుగా ఇద్దరు మరదళ్లతో ఒకరికి తెలియకుండా ఒకరితో ప్రేమాయ‌ణం సాగించాడు అర్జున్​. ఇక ఈ క్రేజీ ల‌వ్ స్టోరీలకు పెళ్లితో శుభం కార్డు వేయాల‌ని భావించాడు. నెల రోజుల కిందట ఇద్దరినీ ప్రేమించాను, ఇద్దరినీ పెళ్లి చేసుకుంటానని మూడు కుటుంబాల ముందు ప్ర‌తిపాద‌న ఉంచాడు. వారు గ్రామ పెద్దలు ఆశ్రయించారు. సూర్యకళ, ఉషారాణిని అర్జున్​కు ఇచ్చి వివాహం చేయడానికి వారి కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. ఈనెల 14న ఘన్​పూర్​లో సూర్యకళ, ఉషారాణిని ఆదివాసీల సంప్రదాయం ప్రకారం అర్జన్​ పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Also Read:  కరోనా టీకాలు, అపోహలు –వాస్తవాలు.. పూర్తి వివ‌రాలు

ప్రపంచంలో అతి పెద్ద మూడో వజ్రం ఆఫ్రికా దేశాల్లో లభ్యం.. ఇది ఎన్ని క్యారెట్లుందో తెలుసా?

జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?