India Corona Cases: దేశంలో కొత్తగా 2,67,334 కరోనా పాజిటివ్ కేసులు.. రికార్డు స్థాయిలో మరణాలు..
ఇండియాలో కరోనా తీవ్రత కొనసాగుతుంది. కొత్తగా దేశంలో 2,67,334 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే మంగళవారం...
ఇండియాలో కరోనా తీవ్రత కొనసాగుతుంది. మంగళవారం 20,08,296 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. దేశంలో 2,67,334 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే మంగళవారం ఏకంగా 3,89,851 మంది వ్యాధి బారి నుంచి కోలుకోవడం ఊరటనిచ్చే అంశం. అయితే కరోనా మరణాల విషయంలో మాత్రం పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మహమ్మారి దేశంలో మరణమృదంగం మోగిస్తోంది. వైరస్ తో పోరాడలేక మంగళవారం 4529 మంది ప్రాణాలు విడిచారు. ఒకరోజు మరణాలు విషయంలో ఇదే ఇప్పటివరకు అత్యధికం. మరోవైపు మంగళవారం 20,08,296 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 32 కోట్లు దాటిందని వెల్లడించింది.
మొత్తం కేసులు: 2,54,96,330 మొత్తం రికవరీలు: 2,19,86,363 మొత్తం మరణాల సంఖ్య : 2,83,248 ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 32,26,719 ఇప్పటివరకు వ్యాక్సిన్ వేయించుకున్నవారు: 18,58,09,302
ఇప్పటివరకూ సోకింది 2% మందికే….
ప్రస్తుత కరోనా వ్యాప్తి విధానాన్ని బట్టి చూస్తే… దేశంలో కోవిడ్-19 వైరస్ క్రమంగా క్షీణిస్తున్నట్టు అర్థమవుతోందని కేంద్ర ప్రభుత్వం మంగళవారం వెల్లడించింది. ఈ నెల 17 నాటికి దేశ జనాభాలో 1.8% మందికే వైరస్ సోకిందని, ఇంకా 98% మందికి ఈ మహమ్మారి పొంచి ఉందని హెచ్చరికలు జారీ చేసింది. నీతి ఆయోగ్ (ఆరోగ్య విభాగం) సభ్యుడు వీకే పాల్ మంగళవారం ప్రెస్ మీట్ లో ఈ విషయం చెప్పారు. మహమ్మారి నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సక్సెస్ అవుతున్నాయని, కొన్ని రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని చెప్పారు. వైరస్ పునరుత్పత్తి సంఖ్య ఒకటి కంటే తక్కువగానే ఉన్నందున… మహమ్మారి క్షీణిస్తున్నట్టుగా శాస్త్రీయ కోణంలో భావించవచ్చన్నారు.
Also Read: పెళ్లి చేసుకున్న మరుక్షణం..ఆ రెండు జంటలూ చేసిన పని తెలిస్తే.. అభినందించకుండా ఉండలేరు!