Vaccination Bride: మరో గంటలో వివాహం.. పెళ్లి కూతరుగా ముస్తాబై వ్యాక్సినేషన్‌కు సెంటర్‌కు.. ఆదర్శం ఈ యువతి..
Vaccination Bride: కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు ప్రస్తుతం మన దగ్గర ఏకైక అస్త్రం వ్యాక్సినేషన్. దేశంలో ఎంత త్వరగా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి అవుతుందో.. అంత త్వరగా కరోనా...
Vaccination Bride: కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు ప్రస్తుతం మన దగ్గర ఏకైక అస్త్రం వ్యాక్సినేషన్. దేశంలో ఎంత త్వరగా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి అవుతుందో.. అంత త్వరగా కరోనా అంతమవుతుంది. అయితే కొందరిలో మాత్రం వ్యాక్సిన్‌పై ఇంకా కొన్ని అపోహలు ఉంటూనే ఉన్నాయి. ఈ అపోహలను పటాపంచలు చేయడానికి చాలా మంది సెలబ్రిటీలు వ్యాక్సినేషన్ ప్రక్రియపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్‌లోని మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఆదివారం అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను నిర్వహించిన విషయం తెలిసిందే. సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, పోలీసులు, మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్ వేశారు. సుమారు 500 కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే ఈ మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. వివాహానికి సిద్ధంగా ఉన్న ఓ యువతి వ్యాక్సిన్ వేయించుకొని అందరి దృష్టిని ఆకర్షించింది. ఉదయం 9.30 గంటలకు వివాహ ముహుర్తం ఉండగా.. 8.30 గంటలకు వ్యాక్సిన్ కోసం హైటెక్స్ చేరుకుందా యువతి. వ్యాక్సిన్ వేయించుకొని ముహుర్తం సమయానికి మళ్లీ పెళ్లి మండపం చేరుకుంది. దీంతో ఆమె చేసిన పని ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిందని పలువురు అభిప్రాయపడ్డారు. సదరు యువతికి వ్యాక్సిన్ వేయించి.. వివాహ శుభాకాంక్షలు తెలిపారు.