అగ్నికి ఆహుతైన.. లారీ శానిటైజర్

కరోనాను అదుపుచేయడానికి తెలంగాణ ప్రభుత్వం, శానిటైజర్ ద్రావణాన్ని హైదరాబాద్‌తో పాటు అన్ని రాష్ట్రాల్లోనూ స్ప్రే చేస్తున్నారు. కాగా అలాగే శానిటైజర్‌ ద్రావణాన్ని తరలిస్తున్న ఓ లారీ మియాపూర్‌లో ప్రమాదవశాత్తూ..

అగ్నికి ఆహుతైన.. లారీ శానిటైజర్
Follow us

| Edited By:

Updated on: Apr 22, 2020 | 9:04 PM

కరోనాను అదుపుచేయడానికి తెలంగాణ ప్రభుత్వం, శానిటైజర్ ద్రావణాన్ని హైదరాబాద్‌తో పాటు అన్ని రాష్ట్రాల్లోనూ స్ప్రే చేస్తున్నారు. కాగా అలాగే శానిటైజర్‌ ద్రావణాన్ని తరలిస్తున్న ఓ లారీ మియాపూర్‌లో ప్రమాదవశాత్తూ అగ్నికి ఆహుతైంది. జీడిమెట్ల నుంచి సంగారెడ్డి వైపుకు వెళుతున్న ఈ లారీ మియాపూర్‌ బస్‌ డిపో వద్దకు రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని పసిగట్టిన డ్రైవర్, క్లీనర్ లారీ దిగి పరారయ్యారు. లారీలో ఒక్కొక్క క్యాన్‌లో 20 లీటర్ల శానిటేషన్ ద్రావణంతో సంగారెడ్డి వైపుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది శకటాలతో తరలివచ్చి మంటలను ఆదుపులోకి తెచ్చేందుకు శ్రమించారు.

కాగా ఈరోజు తెలంగాణలో కొత్తగా 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఒకరు మృతి చెందారు. కాగా వీటితో మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు 943కి చేరాయి. ఇప్పటివరకూ కరోనాతో 24 మంది మృతి చెందారు. అలాగే ఇప్పటివరకూ194 మంది డిశ్చార్జ్ అయ్యారు.

Read More: 

ఏప్రిల్ 27న సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్..

సీఎం కేసీఆర్‌కు ఆర్జీవీ దిమ్మతిరిగే ఛాలెంజ్..

జగన్ ప్రభుత్వం వల్ల రూ.1400 కోట్లు వృథా.. కన్నా సంచలన వ్యాఖ్యలు

పవన్‌తో సినిమా నేను చేయలేను.. జక్కన్న సెన్సేషనల్ కామెంట్స్

ట్రాన్స్‌జెండర్లకు కేంద్రం గుడ్‌న్యూస్.. అన్ని అప్లికేషన్స్‌లోనూ..

Latest Articles