కోవిడ్‌తో భర్త మృతి, మనస్తాపంతో సూసైడ్ చేసుకున్న భార్య!
భర్త లేడన్న బాధతోపాటు కరోనా వచ్చిందేమోనన్న భయంతో ఓ మహిళ సూసైడ్ చేసుకున్న విషాద సంఘటన హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డి గూడకు చెందిన ఓ 34 ఏళ్ల యువకుడికి జులై 31న కరోనా పాజిటివ్ తేలగా..
భర్త లేడన్న బాధతోపాటు కరోనా వచ్చిందేమోనన్న భయంతో ఓ మహిళ సూసైడ్ చేసుకున్న విషాద సంఘటన హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డి గూడకు చెందిన ఓ 34 ఏళ్ల యువకుడికి జులై 31న కరోనా పాజిటివ్ తేలగా ఇంట్లోనే ప్రత్యేక గదిలో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే ఈ నెల 4న అతని తండ్రికి కోవిడ్ లక్షణాలు కనిపించగా పరీక్షలు చేయడంతో పాజిటివ్ అని రిపోర్ట్స్‌లో తేలింది. దీంతో తండ్రీ కొడుకులిద్దరూ పై అంతస్తులో ఉండి చికిత్స తీసుకుంటున్నారు.
కింది అంతస్తులో తల్లి(55) ఉంటూ భర్త, కుమారుడికి ఆహారం అందిస్తూ సపర్యలు చేసేది. ఈ క్రమంలో వైరస్ తీవ్రత ఎక్కువయి ఈ నెల 6న శుక్రవారం భర్త మృతి చెందాడు. అనంతరం కుమారుడు కూడా మరోసారి కరోనా పరీక్ష చేయించుకునేందుకు హాస్పిటల్‌కి వెళ్లి తిరిగి వచ్చేసరికి.. తల్లి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు కూడా గత రెండు రోజుల నుంచి జలుబు, దగ్గుతో బాధపడుతున్నట్లు తెలిసింది. భర్తను కోల్పోయినందుకు బాధ, తనకూ వైరస్ సోకుతుందేమోనని భయంతోనే తన తల్లి ఆత్మహత్య చేసుకున్నట్లు యువకుడు శుక్రవారం పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా సూసైడ్ చేసుకున్న మహిళలకు టెస్ట్ చేయగా కరోనా నెగిటివ్ వచ్చింది. దీంతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Read More:
తెలుగు రాష్ట్రాల్లో టెర్రర్ సృష్టిస్తోన్న కరోనా.. పెరుగుతోన్న కేసుల సంఖ్య
48 గంటలు అన్నీ బంద్.. పుట్టపర్తిలో పూర్తిస్థాయి లాక్‌డౌన్