కోళీకోడ్ విమాన ప్రమాద బాధితుల్లో 40 మందికి కరోనా పాజిటివ్..!
కేరళ విమాన ప్రమాదంలో చనిపోయిన 18 మందికి ఒకరికి.. అలాగే బాధితుల్లో 40 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని కేరళ మంత్రి కేటీ జలీల్ వెల్లడించారు.
Kozhikode Flight Accident: కేరళలోని కోళీకోడ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. వందేమాతరం మిషన్‌లో భాగంగా ఈ విమానం 191 మంది ప్రయాణీకులను దుబాయ్ నుంచి కోళీకోడ్‌కు తీసుకొస్తుండగా.. ల్యాండింగ్ సమయంలో స్కిడ్ కావడంతో రన్‌వే పక్క నుంచి 35 అడుగుల లోయలో పడిపోయింది. దీనితో విమానం రెండు ముక్కలైంది. కేరళలో భారీ వర్షాలు కురుస్తుండటం వల్ల ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు చెబుతున్నారు. కాగా, ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లతో పాటు 19 మంది మరణించారు. ఇక ఈ ప్రమాదంలో చనిపోయిన 18 మందికి ఒకరికి.. అలాగే బాధితుల్లో 40 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని కేరళ మంత్రి కేటీ జలీల్ వెల్లడించారు.
Also Read: ఏపీ వచ్చే విదేశీ ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. క్వారంటైన్ నుంచి మినహాయింపు!