Breaking : మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కన్నుమూత
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
Former MP Nandi Yellaiah Death : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొద్దిరోజుల క్రితం కరోనా సోకడంతో ఆయన్ను నిమ్స్‌కు తరలించారు కుటుంబ సభ్యులు. అయితే చికిత్స అనంతరం ఇటీవల చేసిన టెస్టులో ఆయనకు కరోనా నెగిటివ్ అని అని నిర్దారణ అయ్యింది. కాకపోతే కరోనా వల్ల ఆయన రోగ నిరోధక వ్యవస్థ బాగా దెబ్బతింది. కాగా ఈ రోజు ఉదయం 10 గంటలకు నిమ్స్ లో క్రానికల్ వ్యాధితో నంది ఎల్లయ్య మరణించినట్లు కుటుంబ సబ్యులు తెలిపారు. దీంతో రాంనాగర్‌లోని ఆయన నివాసం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. నంది ఎల్లయ్య మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు.
గతంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా నంది ఎల్లయ్య సేవలందించారు. సిద్దిపేట లోక్‌సభ స్థానం నుంచి ఐదుసార్లు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గం నుంచి ఒకసారి ఎంపీగా ప్రాతినిథ్యం వహించారు. రాజ్యసభలోనూ తన వాయిస్ వినిపించారు.
Read Also : తెలుగులో వస్తున్న తొలి ‘జాంబీ’ చిత్రం : ‘జాంబీ రెడ్డి’