తెలుగులో వస్తున్న తొలి ‘జాంబీ’ చిత్రం : ‘జాంబీ రెడ్డి’

తెలుగులో వస్తున్న తొలి 'జాంబీ' చిత్రం :  'జాంబీ రెడ్డి'

'అ!', 'కల్కి' లాంటి విభిన్న చిత్రాల‌తో టాలీవుడ్‌లో ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నాడు యువ‌ దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఆయ‌న తాజాగా తన కొత్త సినిమా టైటిల్ అనైన్స్ చేశాడు.

Ram Naramaneni

|

Aug 08, 2020 | 12:41 PM

‘అ!’, ‘కల్కి’ లాంటి విభిన్న చిత్రాల‌తో టాలీవుడ్‌లో ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నాడు యువ‌ దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఆయ‌న తాజాగా తన కొత్త సినిమా టైటిల్ అనైన్స్ చేశాడు. ‘జాంబీ రెడ్డి’ పేరుతో తీస్తున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఫస్ట్​లుక్​ మోష‌న్ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. దాన్ని బ‌ట్టి చూస్తే.. థ్రిల్‌తో పాటు హార‌ర్ జోన‌ర్‌లో సినిమాని తెర‌కెక్కిస్తున్నారా అనే అనుమానం ప్రేక్ష‌కుల‌లో క‌లుగుతుంది. తెలుగులో తీస్తున్న తొలి జాంబీ చిత్రమిదేనని నిర్మాతలు వెల్ల‌డించారు.

ఈ సినిమాలో కరోనా లాంటి ఓ ప్ర‌మాద‌క‌ర వైర‌స్ నేప‌థ్యంలో ఉండనున్నట్లు స‌మాచారం. నిజ జీవిత సంఘటనల ఆధారంగా దీనిని తెర‌కెక్కిస్తున్నారు. మార్క్ కే రాబిన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఆపిల్ ట్రీ స్టూడియోస్​ పతాకంపై రాజశేఖర్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu