నేడు, రేపు తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు

తెలంగాణ‌లో వ‌చ్చే రెండు రోజులు భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశమున్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ సూచించింది. నైరుతి మ‌ధ్య ప్ర‌దేశ్ ప్రాంతంలో అల్ప‌పీడ‌నం కొన‌సాగుతుండ‌గా, ఉత్త‌ర బంగాళాఖాతం ప‌రిస‌ర ప్రాంతాల్లో ఆదివారం మ‌రో అల్ప‌పీడ‌నం ఏర్ప‌డే ఛాన్స్ ఉంది. అలాగే మ‌రో వైపు ప‌శ్చిమ బెంగాల్..

నేడు, రేపు తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు
Follow us

| Edited By:

Updated on: Aug 08, 2020 | 7:39 AM

తెలంగాణ‌లో వ‌చ్చే రెండు రోజులు భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశమున్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ సూచించింది. నైరుతి మ‌ధ్య ప్ర‌దేశ్ ప్రాంతంలో అల్ప‌పీడ‌నం కొన‌సాగుతుండ‌గా, ఉత్త‌ర బంగాళాఖాతం ప‌రిస‌ర ప్రాంతాల్లో ఆదివారం మ‌రో అల్ప‌పీడ‌నం ఏర్ప‌డే ఛాన్స్ ఉంది. అలాగే మ‌రో వైపు ప‌శ్చిమ బెంగాల్, ఉత్త‌ర ఛ‌త్తీస్ గ‌ఢ్ మీదుగా 2.8 నుంచి 4.5 కిలో మీట‌ర్ల ఎత్తు వ‌ర‌కు ఉప‌రిత‌ల ద్రోణి ఏర్ప‌డింది. ఈ రెండింటి ప్ర‌భావం కార‌ణంగా శ‌ని, ఆదివారాల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు చోట్ల ఉరుములు, మెరుపుల‌తో కూడి ఓ మోస్త‌రు వ‌ర్షాలు, మ‌రికొన్ని ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు ప‌డే ఛాన్స్ ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ ప్ర‌క‌టించింది. ఇక గురువారం నుంచి శుక్ర‌వారం ఉద‌యం వ‌ర‌కు మంచిర్యాల జిల్లా కొత్త‌ప‌ల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో 3 సెంటీమీట‌ర్ల చొప్పును వ‌ర్షం కురిసిన‌ట్టు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు వెల్ల‌డించారు.