48 గంట‌లు అన్నీ బంద్‌.. పుట్ట‌ప‌ర్తిలో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోజురోజుకీ క‌రోనా మ‌హ‌మ్మారి తీవ్రంగా ఉధృతి చెందుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఏపీలో క‌రోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రెండు ల‌క్ష‌లు దాటిపోయింది. జిల్లాలు, గ్రామాల్లో కూడా ఈ వైర‌స్ వ్యాప్తి చెందుతూండ‌టంతో ప‌లు ప్రాంతాల్లో లాక్‌డౌన్..

48 గంట‌లు అన్నీ బంద్‌.. పుట్ట‌ప‌ర్తిలో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌
Follow us

| Edited By:

Updated on: Aug 08, 2020 | 9:03 AM

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోజురోజుకీ క‌రోనా మ‌హ‌మ్మారి తీవ్రంగా ఉధృతి చెందుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఏపీలో క‌రోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రెండు ల‌క్ష‌లు దాటిపోయింది. జిల్లాలు, గ్రామాల్లో కూడా ఈ వైర‌స్ వ్యాప్తి చెందుతూండ‌టంతో ప‌లు ప్రాంతాల్లో లాక్‌డౌన్ అమ‌లు ప‌రుస్తున్నారు అధికారులు. తాజాగా అనంత‌పురం జిల్లాలోని పుట్ట‌ప‌ర్తిలో క‌రోనా ఉధృతి కొన‌సాగుతోంది. క‌రోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్న త‌రుణంలో పుట్ట‌ప‌ర్తి అధికారులు పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ రోజు నుంచి 48 గంట‌ల పాటు అంటే సోమ‌వారం ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కూ ఈ పూర్తిస్థాయి లాక్‌డౌన్ కొన‌సాగుతుంది. దీంతో అత్య‌వ‌స‌ర సేవ‌లు విన‌హా అన్నీ బంద్ కానున్నాయి. ప్ర‌జ‌ల‌కు అత్య‌వ‌స‌రం అయితేనే బ‌య‌ట‌కు రావాల‌ని అధికారులు హోచ్చ‌రిస్తున్నారు. ఇంకా స‌రైన వ్యాక్సిన్ రాక‌పోవ‌డంతో కోవిడ్‌ను కంట్రోల్ చేయాలంటే లాక్‌డౌన్ ఒక్క‌టే మార్గం కావ‌డంతో అధికారులు లాక్‌డౌన్ విధిస్తున్నారు.

కాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు 2 లక్షలు మార్క్ దాటాయి. గ‌డిచిన 24 గంటల వ్యవధిలో 10,171 కొత్త కోవిడ్ కేసులు నమోదు కాగా… మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,06,960కి చేరింది. కరోనాతో కొత్త‌గా 89 మంది ప్రాణాలు విడిచారు. కొవిడ్​తో ఇప్పటివరకు రాష్ట్ర‌వ్యాప్తంగా 1,842 మంది చ‌నిపోయారు. రాష్ట్రంలో వ్యాధి నుంచి 1,20,464 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 84,654 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. గ‌డిచిన‌ 24 గంటల వ్యవధిలో 62,938 మందికి కరోనా టెస్టులు చేశారు. ఇప్పటివరకు మొత్తం 23.62 లక్షల మందికి కరోనా టెస్టులు చేసిన‌ట్టు ప్రభుత్వం వెల్లడించింది.

Read More: నేడు, రేపు తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు