Corona in Telangana: తెలంగాణలోని ఆ గ్రామంలో సెంచరీ పాజిటివ్ కేసులు.. వణికిపోతున్న గ్రామస్థులు
కరోనా వైరస్ జనగాం జిల్లాను కకావికలం చేస్తుంది. గత కొద్ది రోజులుగా జిల్లాలో కరోనా విలయ తాండవం చేస్తోంది. తొలుత జిల్లా కేంద్రానికే పరిమితమై వైరస్..
కరోనా వైరస్ జనగాం జిల్లాను కకావికలం చేస్తుంది. గత కొద్ది రోజులుగా జిల్లాలో కరోనా విలయ తాండవం చేస్తోంది. తొలుత జిల్లా కేంద్రానికే పరిమితమై వైరస్.. క్రమంగా పక్కనున్న పల్లెలకు విస్తరించింది. దీంతో జిల్లా వ్యాప్తంగా అధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మహమ్మరికి గురైన బాధితులతో జిల్లా ఆసుపత్రి నిండిపోయింది. అటు హోం ఐసోలేషన్ ఉండి చికిత్స పొందుతున్న వారు సైతం మృత్యువాత పడుతున్నారు. జిల్లాలో కరోనా కేసులు పెరగడంతో పలు గ్రామాల్లో ఇప్పటికే స్వచ్చందంగా లాక్ డౌన్ విధించుకున్నారు. మొన్నటి వరకు లింగాల ఘనపూరం కళ్లెంలో అత్యధిక కేసులు నమోదు కాగా ఆ గ్రామ సరసన తాజాగా నెల్లుట్ల చేరింది. జనగాం జిల్లా కేంద్రానికి అనుకుని ఉన్న నెల్లుట్లలో 100కి పైగా యాక్టివ్ కేసులు నమోదు కావడం జిల్లాను హడలెత్తిస్తుంది.
నెల్లుట్లో గత కొద్ది రోజులుగా కరోనా మరణాలు పెరుగుతున్నాయి. ఒక్క రోజే ఇద్దరు మృత్యువాత పడటంతో గ్రామంలో భయాందోళన నెలకొంది. మృతదేహాలకు స్వయంగా సర్పంచ్ భర్త, గ్రామ పంచాయతి సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి దహన సంస్కారాలు నిర్వహించారు. గ్రామంలో వైద్య ఆరోగ్య, పంచాయతి రాజ్ శాఖల అధికారులు శానిటటైజేషన్ చేశారు. గ్రామంలో కరోనా కేసులు పెరగడంతో సెల్ఫ్ లాక్ డౌన్ విధించాలని నిర్ణయించారు.
Also Read: పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మన్ పుట్టా మధు అరెస్ట్.. భీమవరంలోని ఓ హోటల్‌లో ఉండగా