Corona vaccine : టీకా తీసుకున్నవారిలో ఎంతమందికి కోవిడ్ వచ్చిందంటే…!
మూడు నాలుగు వారాల కిందట వ్యాక్సిన్‌పై జనం అంతగా ఆసక్తి చూపలేదు. ఇప్పుడు కరోనా అల్లకల్లోలం చేస్తుండే సరికి వ్యాక్సిన్ విలువేమిటో తెలిసింది...
Corona vaccine : మూడు నాలుగు వారాల కిందట వ్యాక్సిన్‌పై జనం అంతగా ఆసక్తి చూపలేదు. ఇప్పుడు కరోనా అల్లకల్లోలం చేస్తుండే సరికి వ్యాక్సిన్ విలువేమిటో తెలిసింది. ఇప్పుడేమో టీకా వేసుకుందామనుకున్నా స్టాక్ లేదు. నిజానికి కరోనా వైరస్‌ను నియంత్రించడం కోసం చాలా దేశాలు వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తున్నాయి.. ఇప్పటికే వ్యాక్సినేషన్‌ను కూడా మొదలు పెట్టాయి. భారత్ విషయానికి వస్తే భారత్ బయోటెక్ కంపెనీకి చెందిన కోవాగ్జిన్, సీరం కంపెనీకి చెందిన కోవిషీల్డ్ ప్రభుత్వం అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. ఈ రెండు టీకాలను ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఇస్తున్నారు. టీకాల కోసం జనం గంటల తరబడి లైన్‌లో నిల్చుకోవడాన్ని చూస్తున్నాం..
అయినా ఇంకా కొందరిలో వ్యాక్సిన్‌పై కొన్ని అనుమానాలున్నాయి. వ్యాక్సిన్ తీసుకున్నవారికి కూడా కరోనా పాజిటివ్ వస్తున్నది కదా? తీసుకోవడం వల్ల ఏమిటీ ఉపయోగం అని అంటున్నారు. నిజమే.. టీకా తీసుకున్నవారికి కూడా కోవిడ్ పాజిటివ్ వస్తుంది. అయితే వ్యాక్సిన్ అనేది కరోనా రాకుండా అడ్డుకునేందుకు కాదు.. వైరస్ వైరస్ శరీరంలో ప్రవేశించినప్పుడు దానితో పోరాడటం కోసం..రోగ నిరోధక వ్యవస్థను ఉత్తేజపర్చడం కోసం.. వైరస్ ఇతర కణాలకు వ్యాపించకుండా నిరోధించడం కోసం.. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కోవిడ్ వచ్చినా కంగారు పడాల్సిన అవసరం ఉండదు. టీకా తీసుకుంటే ప్రాణాపాయం తగ్గుతుంది. వైరస్ బారిన పడినా త్వరగానే కోలుకుంటారు తప్పితే ప్రాణాలు పోయే పరిస్థితి రాదు. ఇప్పటికే చాలా మంది ఫస్ట్ డోస్ తీసుకున్నారు. రెండు డోసులు తీసుకున్న తర్వాత అవి సమర్థంగా పని చేయడానికి నెలన్నర రోజులు పడుతుంది. అంచేత నిరభ్యతరంగా టీకాలు తీసుకోవచ్చు. కోవిషీల్డ్ మొదటి డోస్ తీసుకున్న వారు పది కోట్ల మందికిపైగానే ఉన్నారు. వీరిలో కేవలం 17 వేల మంది మాత్రమే కరోనా బారినపడ్డారు. అంటే 0.02 శాతం మాత్రమే అన్నమాట!
కోవిషీల్డ్ రెండో డోస్ కూడా తీసుకున్నవారు కోటిన్నరకు పైగానే ఉన్నారు. వీరిలో కేవలం అయిదు వేల మందికి మాత్రమే కరోనా సోకింది. అంటే 0.03 శాతం మాత్రమే! అంటే చాలా తక్కువన్నమాట! కోవాగ్జిన్ మొదటి డోస్ టీకా తీసుకున్నవారు ఇంచుమించు కోటి మంది ఉన్నారు. ఇందులో కేవలం నాలుగు వేల మందికి మాత్రమే కోవిడ్ సోకింది. అంటే 0.04 శాతం మంది మాత్రమే కరోనా బారిన పడ్డారన్నమాట. ఇక రెండో డోస్ కూడా కంప్లీట్ చేసుకున్నవారు సుమారు 20 లక్షల మంది ఉన్నారు. రెండో డోస్ కూడా తీసుకున్నవారిలో కేవలం ఏడువందల మందికి మాత్రమే కరోనా అంటుకుంది. అంటే 0.04 శాతం అన్నమాట! దీన్ని బట్టి వ్యాక్సిన్ తీసుకోవడం ఎంత శ్రేయస్కరమో అర్థమవుతున్నది కదా! అంచేత ఎలాంటి అనుమానాలు, సందేహాలు పెట్టుకోకుండా టీకా తీసుకోండి.. మరిన్ని చదవండి ఇక్కడ : IPL 2021 Video: ఉన్నపళంగా క్రికెటర్లు మాల్దీవులకు ప్రయాణం కారణం ఏమై ఉంటుంది.. ? ….(వీడియో ) Viral News: కోవిడ్ రోగుల కోసం నర్సు పాడిన పాట.. నెట్‌లో వైరల్…. ( వీడియో )