AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Putta Madhu Arrest: పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మన్ పుట్టా మధు అరెస్ట్.. భీమ‌వ‌రంలోని ఓ హోటల్‌లో ఉండ‌గా

పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మన్ పుట్టా మధు మిస్సింగ్ సస్పెన్స్ ఎట్ట‌కేల‌కు వీడంది. పుట్టా మధును భీమవరంలో ఓ హోటల్‌లో....

Putta Madhu Arrest: పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మన్ పుట్టా మధు అరెస్ట్.. భీమ‌వ‌రంలోని ఓ హోటల్‌లో ఉండ‌గా
Putta Madhu
Ram Naramaneni
|

Updated on: May 08, 2021 | 10:41 AM

Share

హైకోర్టు న్యాయవాదులు వామన్‌రావు దంపతుల హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మన్ పుట్టా మధు మిస్సింగ్ సస్పెన్స్ ఎట్ట‌కేల‌కు వీడంది. పుట్టా మధును భీమవరంలో ఓ హోటల్‌లో రామగుండం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం అత‌డికి హైద‌రాబాద్ కు తీసుకువ‌స్తున్నారు. అత‌డిపై ఉన్న కేసులు స‌హా క‌నిపించ‌కుండాపోవ‌డం వెనుక కార‌ణాల‌పై పోలీసుల ఫోక‌స్ పెట్టారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ భూకబ్జాల వ్యవహారం వెలుగులోకి వచ్చిన రోజు నుంచే మ‌ధు కనిపించకుండా పోవ‌డం క‌లక‌లం రేపింది. ఇటీవల మంత్రివర్గం నుంచి బర్తర్‌ఫకు గురైన ఈటల రాజేందర్‌కు పుట్ట మధు సన్నిహితంగా మెలిగారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తో పుట్టామధు కలిసి వ్యాపార లావాదేవీలు కూడా నిర్వహించినట్లు, దీంతో ఆయనపై సీఎం కేసీఆర్‌ అసంతృప్తితో ఉన్నందునే అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు ప్రచారం జరిగింది. హైకోర్టు న్యాయవాదులు వామన్‌రావు, నాగమణి దంపతుల హత్య కేసులో కొత్త కోణాలు వెలుగు చూడడంతో ఈ కేసు విష‌యంలో భ‌యంతోనే పుట్టా మధు  క‌నిపించ‌కుండా పోయార‌న్న ప్ర‌చారం కూడా జ‌రుగుతుంది.

పుట్ట మ‌ధు భార్య వెర్ష‌న్ ఇలా ఉంది….

పుట్ట మధు అజ్ఞాతంపై ఆయన భార్య, మంథని మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ వివరణ ఇచ్చారు. పుట్ట మధు ఎక్కడికీ వెళ్లలేదని ఆమె స్పష్టం చేశారు. తన భర్తకు స్వల్ప కోవిడ్ లక్షణాలు ఉన్నాయని, అందుకే ఫోన్ స్విచ్చాఫ్ చేశారని శైలజ వివరించారు. తన భర్తపై బయట జరుగుతున్న ప్రచారం చాలా తప్పని, ప్రజా ప్రతినిధులకు పర్సనల్ లైఫ్ కూడా ఉంటుందని గుర్తు చేశారు. ఈటల రాజేందర్ పార్టీలో ఉండేవారు కాబట్టి, ఆయన్ను అప్పట్లో కలిశామని పేర్కొన్నారు. తాము టీఆర్‌ఎస్‌తోనే ఉంటామని ఆమె స్పష్టం చేశారు.

Also Read: చిన్నారుల నుంచి కరోనా అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుంది..వారికి వైరస్ సోకకుండా జాగ్రత్త పడాల్సిందే!

 భార్యను బ్లేడుతో కోసి చంపిన భర్త.. హ‌త్య వెనుక కరోనా వ్య‌ధ‌.. వివ‌రాలు ఇవి

Follow Us
ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. చేరేముందు అదిరే ట్విస్ట్
ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. చేరేముందు అదిరే ట్విస్ట్
పెళ్లింట తీరని విషాదం.. తల్లి, కూతురు ఆత్మహత్య
పెళ్లింట తీరని విషాదం.. తల్లి, కూతురు ఆత్మహత్య
బాబోయ్‌ భయంకరం.. వ్యక్తిని బంతిలా గాలిలోకి ఎగరేసి, కాళ్లతో తొక్కి
బాబోయ్‌ భయంకరం.. వ్యక్తిని బంతిలా గాలిలోకి ఎగరేసి, కాళ్లతో తొక్కి
శేషాచలం అడవుల్లో అరుదైన ఆకుపచ్చ నాగుపాము.. వైరల్ అవుతున్న వీడియో
శేషాచలం అడవుల్లో అరుదైన ఆకుపచ్చ నాగుపాము.. వైరల్ అవుతున్న వీడియో
కెనాల్‌ను శుభ్రం చేస్తుండగా దూసుకొచ్చిన కొండ చెలువలు..!
కెనాల్‌ను శుభ్రం చేస్తుండగా దూసుకొచ్చిన కొండ చెలువలు..!
పెళ్లి చేసుకునే వారికి కొత్త టెన్షన్.. వాటితో సంబంధం లేదంటున్న
పెళ్లి చేసుకునే వారికి కొత్త టెన్షన్.. వాటితో సంబంధం లేదంటున్న
డీమార్ట్ బంపర్ ఆఫర్.. ఇండక్షన్ స్టవ్‌లపై అదిరిపోయే డిస్కౌంట్లు..
డీమార్ట్ బంపర్ ఆఫర్.. ఇండక్షన్ స్టవ్‌లపై అదిరిపోయే డిస్కౌంట్లు..
ఈ కూరగాయలతో గిన్నెలు తోమండి… జిడ్డు పోయి మెరిసిపోవడం పక్కా
ఈ కూరగాయలతో గిన్నెలు తోమండి… జిడ్డు పోయి మెరిసిపోవడం పక్కా
గంభీర్ కు 2027 వన్డే ప్రపంచకప్పే అసలైన అగ్నిపరీక్ష : గంగూలీ
గంభీర్ కు 2027 వన్డే ప్రపంచకప్పే అసలైన అగ్నిపరీక్ష : గంగూలీ
ఏపీ టెన్త్ విద్యార్థులకు ఊరట.. నిమిషం నిబంధన ఎత్తివేత
ఏపీ టెన్త్ విద్యార్థులకు ఊరట.. నిమిషం నిబంధన ఎత్తివేత