Corona in Children: చిన్నారుల నుంచి కరోనా అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుంది..వారికి వైరస్ సోకకుండా జాగ్రత్త పడాల్సిందే!
Coronavirus In Children: కరోనా.. ఇది ప్రపంచ మానవాళికి అంతుపట్టని మహమ్మారి. ఎక్కడి నుంచి వచ్చింది అనేది తేలలేదు.. తేలదు కూడా.. ఇది ఎలా వ్యాప్తిస్తుంది అనేది తేలుతుంది అనే ఆశతోనే శాస్త్రవేత్తలు పరిశోధనలు కొనసాగిస్తున్నారు.
Corona in Children: కరోనా.. ఇది ప్రపంచ మానవాళికి అంతుపట్టని మహమ్మారి. ఎక్కడి నుంచి వచ్చింది అనేది తేలలేదు.. తేలదు కూడా.. ఇది ఎలా వ్యాప్తిస్తుంది అనేది తేలుతుంది అనే ఆశతోనే శాస్త్రవేత్తలు పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఎలా వ్యాపిస్తుంది అనేదానికి కచ్చితమైన సూచనలు దొరికితే వ్యాప్తిని అడ్డుకట్ట వేయడానికి మార్గాలు దొరకడం పెద్ద కష్టం కాదు. అయితే, కరోనా రోజు రోజుకీ తీరు మారుస్తుండటం..అందర్నీ ఆందోళనలో పడేయటమే కాకుండా.. చాలా విషయాలు తెలుసుకోవడానికీ కుదరని పరిస్థితి ఏర్పడింది. అందుకే రోజుకో రకమైన అప్ డేట్ కరోనా వైరస్ విషయంలో వస్తోంది. దీంతో మరింత ఆందోళన కలుగుతోంది. తాజాగా ఓ పరిశోధన కరోనా వ్యాప్తి పై మరో సంచలన విషయం బయటపెట్టింది.
ది జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (జామా) లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, పిల్లలు పెద్దల కంటే వేగంగా కరోనాను వ్యాప్తి చేస్తారు. పిల్లలు పెద్ద ‘వైరల్ లోడ్’ కలిగి ఉంటారు. అందువల్ల పెద్దల కంటే కొరోనా వైరస్ ను “మరింత సమర్థవంతంగా” వ్యాపించేందుకు కారణం అవుతారని అధ్యయనం కనుగొంది. ‘వైరల్ లోడ్’ అనేది ఒక వ్యక్తి తీసుకునే వైరస్ మొత్తాన్ని సూచిస్తుంది. ఈ అధ్యయనం ఐదేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలపై దృష్టి కేంద్రీకరించింది. అలాగే తేలికపాటి నుండి మితమైన లక్షణాల పై పరిశోధన సాగించింది. ఈ పిల్లలు పెద్ద పిల్లలు అదేవిధంగా పెద్దల కంటే ముక్కు,గొంతులో 10 నుండి 100 రెట్లు ఎక్కువ వైరస్ ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు.
అధ్యయనం ఫలితాల ప్రకారం, మనం ఇప్పుడు రెండు కారణాల వల్ల మన పిల్లలను రక్షించాలి; ఒకటి..సంక్రమణ ప్రమాదం ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది. రెండు.. పిల్లలు తమ చుట్టూ ఉన్నవారికి ప్రమాదం కలిగిస్తారు. వీలైనంత త్వరగా పిల్లలకు టీకాలు వేయడం చాలా ముఖ్యం అని దీని అర్థం. కానీ, వారికి పెద్దవారికి ఇచ్చే అటువంటి డోస్ ఇవ్వవచ్చా? అనేది ప్రశ్న. దీనికి సమాధానం అవుననే చేబుతునంరు. పిల్లలకు కూడా ఇదే వ్యాక్సిన్ ఇవ్వవచ్చు, కాని మోతాదు సర్దుబాటు చేయాలి అని పరిశోధకులు చెబుతున్నారు. .
ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ తయారీదారులు తమ వ్యాక్సిన్ షాట్లను ఫైజర్, మోడెర్నా వంటి సంస్థలతో కలసి డోసింగ్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు, పిల్లలకు వ్యాక్సిన్ మోతాదు ఎంత సురక్షితం అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యాక్సిన్ల మోతాదు పిల్లల వయస్సు ప్రకారం సర్దుబాటు చేయబడుతుంది, అంటే వివిధ వయసుల పిల్లలకు వారి శరీరం యొక్క సహనం ప్రకారం, టీకా యొక్క వేరే మోతాదు ఇవ్వబడుతుంది. వ్యాక్సిన్ డోస్ ల సంగతి తెలేవారకూ పిల్లలను సురక్షితంగా చూసుకోవాల్సిందే.