AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్టూడెంట్స్‌కి గుడ్‌న్యూస్‌..నీట్‌, జేఈఈ మెయిన్ ఎగ్జామ్స్‌…

మే 3 త‌ర్వాత ప్ర‌భుత్వం ఎలాంటి నిర్ణ‌యం తీసుకోబోతుంద‌ని ఎదురు చూస్తున్న విద్యార్థుల‌కు కేంద్రం శుభ‌వార్త చెప్పింది. ముఖ్య‌మైన ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై ..

స్టూడెంట్స్‌కి గుడ్‌న్యూస్‌..నీట్‌, జేఈఈ మెయిన్ ఎగ్జామ్స్‌...
Jyothi Gadda
|

Updated on: Apr 28, 2020 | 7:26 AM

Share
దేశంలో క‌రోనా వైరస్‌ రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి ప‌రిణామాల నేప‌థ్యంలో విద్యార్థులు అయోమ‌యంలో ప‌డ్డారు. ఏప్రిల్, మే నెల‌లో జ‌ర‌గాల్సిన ప‌లు ప్ర‌వేశ ప‌రీక్ష‌లు వాయిదా ప‌డ‌టంతో స్టూడెంట్స్ ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. త‌మ భ‌విష్య‌త్ ఏంట‌నే సందేహం వ్య‌క్తం చేస్తున్నారు. తాము ఈ ఏడాది విద్యాసంవ‌త్స‌రం పూర్తిగా కోల్పోయిన‌ట్టైంద‌ని వాపోతున్నారు. మే 3 త‌ర్వాత ప్ర‌భుత్వం ఎలాంటి నిర్ణ‌యం తీసుకోబోతుంద‌ని ఎదురు చూస్తున్న విద్యార్థుల‌కు కేంద్రం శుభ‌వార్త చెప్పింది. ముఖ్య‌మైన ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై కేంద్ర మంత్రి ర‌మేష్ పొక్రియాల్ క్లారిటీ ఇచ్చారు. వివ‌రాల్లోకి వెళితే…
క‌రోనా వైర‌స్ త‌గ్గిన త‌ర్వాతే సీబీఎస్ఈ, జేఈఈ, నీట్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ గురించి ఆలోచిస్తామ‌ని కేంద్ర‌మంత్రి ర‌మేష్ పొక్రియాల్ స్ప‌ష్టం చేశారు. దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వైర‌స్ ప్ర‌భావం త‌గ్గేవ‌ర‌కూ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌బోమ‌ని తేల్చి చెప్పారు. విద్యార్థులు ఈ విష‌యంలో ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని సూచించారు.  అటు లాక్‌డౌన్ కార‌ణంగా విద్యార్థులు న‌ష్ట‌పోయిన కాలాన్ని భ‌ర్తీ చేయ‌డంతో పాటు ఆన్‌లైన్లో విద్యాబోధ‌న, ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై నిపుణుల స‌మ‌క్షంలో మ‌రింత లోతుగా చ‌ర్చిస్తున్నామ‌ని తెలిపారు. ఏదేమైన‌ప్ప‌టికీ విద్యార్థులు మ‌న‌స్తాపానికి గురికావొద్ద‌ని కోరారు.