మారుతీ సుజుకీలో కరోనా కలకలం.. 17 మంది ఉద్యోగులకు పాజిటివ్

ప్రముఖ కార్ల కంపెనీ మారుతీ సుజుకీలో పనిచేస్తున్న ఉద్యోగులను కరోనా వెంటాడుతోంది. మారుతీ సుజుకీ కార్ల ఉత్పత్తి కర్మాగారంలో పనిచేస్తున్న 17 మంది ఉద్యోగులకు కరోనా వైరస్ సోకినట్లు వైద్యాధికారులు నిర్ధారించారు. కాగా, కరోనా బారినపడ్డ ఉద్యోగులు అదృశ్యం కావడంతో వైద్యాధికారులు, పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు...

మారుతీ సుజుకీలో కరోనా కలకలం.. 17 మంది ఉద్యోగులకు పాజిటివ్
Follow us

|

Updated on: Jun 23, 2020 | 1:28 PM

ప్రముఖ కార్ల కంపెనీ మారుతీ సుజుకీలో పనిచేస్తున్న ఉద్యోగులను కరోనా వెంటాడుతోంది. దేశ రాజధాని ఢిల్లీ నగరానికి సమీపంలోని గురుగ్రామ్ నగరంలో ఉన్న మారుతీ సుజుకీ కార్ల ఉత్పత్తి కర్మాగారంలో పనిచేస్తున్న 17 మంది ఉద్యోగులకు కరోనా వైరస్ సోకినట్లు వైద్యాధికారులు నిర్ధారించారు. కాగా, హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్ కర్మాగారంలో కరోనా సోకిన 17 మంది ఉద్యోగులు కనిపించకుండా పోయినట్లు సమాచారం. కరోనా బారినపడ్డ ఉద్యోగులు అదృశ్యం కావడంతో వైద్యాధికారులు, పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. కరోనా బాధితులంతా గురుగ్రామ్, జజ్జార్ ప్రాంతాల్లో నివాసముంటున్నారని సమాచారం.

మారుతీ సుజుకీ కర్మాగారంలో కరోనా రోగుల కోసం క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 17 మంది మారుతీ సుజుకీ ఉద్యోగులకు కరోనా సోకినా, వారి సమాచారాన్ని అధికారులకు తెలియజేయకుండా కంపెనీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని పోలీసులు చెబుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న కరోనా రోగుల కోసం గాలిస్తున్నారు. కాగా, గురుగ్రామ్ జిల్లాలో ఇప్పటి వరకు 67 మంది కరోనా రోగులు అదృశ్యం కావడంపై పలు రకాల అనుమానాలు తలెత్తుతున్నాయి. గురుగ్రామ్ నగరంలో ఒక్క సోమవారం రోజే 85 కొత్త కరోనా కేసులు వెలుగుచూశాయి. దీంతో గురుగ్రామ్ నగరంలో కరోనా కేసుల సంఖ్య 4,512కు పెరిగింది.