ఏపీ వాహనదారులకు మరో గుడ్‌న్యూస్.. ఇక వాట్సాప్ నుంచి రవాణా శాఖ సేవలు..
కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా గుంటూరు జిల్లా రవాణా శాఖ కొత్త ఆలోచనకు తెరలేపారు. లాక్‌డౌన్‌లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు తెచ్చిన విషయం తెలిసిందే కదా. ఈ క్రమంలో రవాణా కార్యాలయాలకు పెద్ద సంఖ్యలో ప్రజలు..

కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా గుంటూరు జిల్లా రవాణా శాఖ కొత్త ఆలోచనకు తెరలేపారు. లాక్‌డౌన్‌లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు తెచ్చిన విషయం తెలిసిందే కదా. ఈ క్రమంలో రవాణా కార్యాలయాలకు పెద్ద సంఖ్యలో ప్రజలు రాకపోకలు కొనసాగిస్తూ ఉన్నారు. దీంతో ఆ తాకిడిని తగ్గించేందుకు.. వాట్సాప్ నెంబర్ల ద్వారా సేవలందించాలని నిర్ణయించినట్లు ఉప రవాణా కమిషనర్ మీరా ప్రసాద్ తెలిపారు.
రవాణా శాఖకు సంబంధించి ఏ సమాచారమైనా.. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటలలోపు వాట్సాప్ నెంబర్లు: 94412 37888, 95509 11189 మెసేజ్ లేదా ఫోన్ చేసి తెలుసుకోవచ్చని డీసీపీ మీరా ప్రసాద్ వెల్లడించారు. అలాగే లెర్నింగ్ లైసెన్స్‌లు, కొత్త డ్రైవింగ్ లైసెన్స్‌ల స్లాట్ బుకింగ్‌లు కూడా జూన్ 1వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తాయని తెలిపారు. సెకండ్ వెహికల్ వెరిఫికేషన్ కోసం డీటీసీ కార్యాలయానికి రాకుండా తమ సమస్యను వాట్సాప్ నెంబర్ల ద్వారా తెలియజేస్తే వాటిని పరిష్కరిస్తామన్నారు. స్మార్ట్ కార్డులు అందకపోయినా వాటి వివరాలను aprtacitizen.epragathi.org ద్వారా తెలుసుకోవచ్చునని లేదా వాట్సాప్ నెంబర్‌కి మెసేజ్ చేసినా సమాచారం అందిస్తామని పేర్కొన్నారు.
అలాగే వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌ల స్మార్ట్ కార్డులను ప్రతీ శుక్రవారం కార్యాలయంలో అందజేయడం జరుగుతుందన్నారు. ఒకవేళ కార్యాలయాలకు ప్రజలు వచ్చినా.. భౌతిక దూరం పాటించడంతో పాటు ఫేస్ మాస్క్ తప్పకుండా ధరించాలని మీరా ప్రసాద్ సూచించారు. కాగా ఆన్‌లైన్‌లో సేవలు పొందేటప్పుడు సరైన చిరునామాలు ఇవ్వాలని కోరారు. కరెక్ట్ అడ్రెస్ ఇవ్వకపోతే.. స్మార్ట్ కార్డులు డెలివరీ చేయలేమన్నారు. అలాగే ఇకపై స్మార్ట్ కార్డులను ఆఫీసుల్లో అందజేయడం జరగదని.. ఆన్‌లైన్‌లో సరైన చిరునామాతో మార్పు చేసుకుంటే పోస్ట్ ద్వారా పంపిస్తామన్నారు.
Read More:
కరోనా నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్‌లు
ఏపీ వాహనదారులకు గుడ్‌న్యూస్.. జూన్ 1 నుంచి లైసెన్స్ సర్వీసులు ప్రారంభం