ఏపీ వాహనదారులకు గుడ్‌న్యూస్.. జూన్ 1 నుంచి లైసెన్స్ సర్వీసులు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలా సడలింపులు తీసుకొచ్చింది. తాజాగా మంగళవారం కూడా పలు షాపులు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. నగలు, బట్టలు, చెప్పులు, స్ట్రీట్ ఫుడ్స్‌కి సైతం తెరిచి ఉంచుకోవచ్చంటూ..

ఏపీ వాహనదారులకు గుడ్‌న్యూస్.. జూన్ 1 నుంచి లైసెన్స్ సర్వీసులు ప్రారంభం
Follow us

| Edited By:

Updated on: May 27, 2020 | 1:10 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలా సడలింపులు తీసుకొచ్చింది. తాజాగా మంగళవారం కూడా పలు షాపులు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. నగలు, బట్టలు, చెప్పులు, స్ట్రీట్ ఫుడ్స్‌కి సైతం తెరిచి ఉంచుకోవచ్చంటూ పేర్కొంది. ఈ సందర్భంగా ఆయా షాపులు అనుసరించాల్సిన విధివిధానాలపై కూడా సర్క్యులర్ జారీ చేసింది ప్రభుత్వం. తాజాగా ఇప్పుడు ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్‌ సర్వీసులకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

లాక్‌డౌన్ కారణంగా నిలిచిపోయిన లెర్నింగ్ లైసెన్స్, కొత్త డ్రైవింగ్ లైసెన్సుల సర్వీసులను పున:ప్రారంభిస్తున్నట్లు డీటీసీ ఎస్ వెంకటేశ్వర్ రావు తెలిపారు. జూన్ 1వ తేదీ నుంచి ఈ సర్వీసులను యథావిథిగా ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఆన్‌లైన్‌లో డ్రైవింగ్ లైసెన్సుల స్లాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. లాక్‌డౌన్‌కు ముందు స్లాట్ బుక్ చేసుకున్నా డ్రైవింగ్ పరీక్షలకు హాజరు కాలేని వాళ్లు.. స్లాట్ బుకింగ్ తేదీలను మార్చుకొని డ్రైవింగ్ టెస్టులకు రావాలని ఆయన పేర్కొన్నారు.

కాగా కరోనా వైరస్‌ను దృష్టిలో పెట్టుకొని కొన్ని నిబంధనలను అమలు చేస్తున్నట్లు డీటీసీ ఎస్ వెంకటేశ్వర్ రావు తెలిపారు. ఒకేసారి ఎక్కువ మంది కార్యాలయంలోకి రావొద్దు. దీనికి ప్రతీ ఒక్కరూ సహకరించాలన్నారు. డ్రైవింగ్ లైసెన్సుల పరీక్షల నిమిత్తం కేవలం ఒకరిని మాత్రమే కార్యాలయంలోకి అనుమతిస్తాం. ప్రతీఒక్కరూ ఖచ్చితంగా భౌతిక దూరాన్ని పాటించాలి. అలాగే ఫేస్ మాస్క్‌ ఉంటే కార్యాలయంలోనికి అనుమతిస్తామని డీటీసీ ఎస్ వెంకటేశ్వర్ రావు స్పష్టం చేశారు.

Read More:

మీరు వింటున్న ‘కరోనా కాలర్ ట్యూన్’ గొంతుక ఈమెదే

రైతులకు మరో గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం జగన్..

ప్రధాని ‘కిసాన్ స్కీమ్’ డబ్బులు.. మీ అకౌంట్లోకి రావడం లేదా? ఇలా చేయండి..

మరో 30 రోజుల్లో కరోనా కేసులు పది రెట్లు పెరిగే అవకాశం.. నిపుణుల వార్నింగ్