పర్సులో వీటిని ఉంచకండి..! ఆర్థిక సమస్యలు వస్తాయి జాగ్రత్త..!
వాస్తు శాస్త్రం మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. మనం అనుకోకుండా చేసే కొన్ని చిన్న తప్పులు ఆర్థిక నష్టాలకు దారితీస్తాయి. ముఖ్యంగా మనం రోజూ ఉపయోగించే పర్సులో ఏ వస్తువులు ఉంచాలో.. ఏవి ఉంచకూడదో తెలుసుకోవడం చాలా అవసరం.

వాస్తు నిపుణుల ప్రకారం కొన్ని ప్రత్యేకమైన వస్తువులను పర్సులో ఉంచితే మన ఆర్థిక స్థితి నెమ్మదిగా పడిపోతుంది. కాబట్టి డబ్బుతో పాటు మీ పర్సులో ఉంచకూడని కొన్ని ముఖ్యమైన వస్తువుల గురించి తెలుసుకుందాం.
పర్సులో పాత బిల్లులు, రసీదులు పెట్టడం వాస్తు ప్రకారం మంచిది కాదు. ఇవి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి. డబ్బు నిలిచిపోతుంది.. కొత్త ఆదాయం రావడం ఆలస్యమవుతుంది. అలాగే పర్సులో పనికిరాని కాగితాలను కూడా ఉంచకూడదు. ఇవి ఆర్థిక సమస్యలను పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు.
నల్ల రంగు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి డబ్బుతో పాటు నల్ల రంగు బట్టలు లేదా ఇతర వస్తువులను పర్సులో ఉంచడం మంచిది కాదు. ఇది ధన ప్రవాహాన్ని నిలిపివేయడమే కాకుండా సంపద తగ్గిపోవడానికి కూడా కారణమవుతుంది.
పదునైన వస్తువులు, ముఖ్యంగా కత్తులు, కీలు లాంటి వాటిని పర్సులో ఉంచడం ఆర్థిక నష్టానికి దారితీస్తుంది. వీటి వల్ల ఖర్చులు అనవసరంగా పెరుగుతాయి. పదునైన వస్తువులు ఉన్న పర్సు నిత్యం ప్రతికూల శక్తిని కలిగి ఉంటుందని వాస్తు నిపుణులు అంటున్నారు.
అతిగా ఫోటోలు పెట్టడం కూడా పర్సులో స్థలం తగ్గించడమే కాకుండా.. వాస్తు ప్రకారం అది అదృష్టకరం కాదు. ముఖ్యంగా మృతుల ఫోటోలు పెట్టడం ఆర్థిక దోషాలకు దారి తీస్తుందని చెబుతారు.
కొంత మంది చిన్న పాకెట్ ఫుడ్ లేదా తీపి పదార్థాలను పర్సులో పెట్టుకుంటారు. అయితే వాస్తు ప్రకారం ఇలా చేయడం మంచిది కాదు. ఇది పర్సులో మురికిని పెంచడమే కాకుండా.. ఆర్థిక ఇబ్బందులను కూడా పెంచుతుంది.
చాలా మంది పర్సులో పాత నాణేలు, చిరిగిన నోట్లను ఉంచుతారు. వీటిని పర్సులో ఉంచడం వాస్తు దోషాన్ని పెంచుతుంది. వీటిని తొలగించి పర్సును శుభ్రంగా ఉంచడం ఆర్థిక స్థిరత్వానికి సహాయపడుతుంది. పర్సును శుభ్రంగా ఉంచడం, అనవసరమైన వస్తువులను తొలగించడం ఆర్థిక స్థితిని మెరుగుపరిచే చక్కటి పద్ధతి.