సర్కారు వారి బ్యాంక్ సెట్టింగ్

ప్రస్తుతం చిత్ర యూనిట్ సెట్టింగ్స్‌పై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో కొన్ని సన్నివేశాలను హైదరాబాద్ లోనే చిత్రీకరిస్తున్నారు. ఇందుకుగాను ఓ భారీ సెట్ ను సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది...

  • Sanjay Kasula
  • Publish Date - 2:29 am, Sat, 27 June 20
సర్కారు వారి బ్యాంక్ సెట్టింగ్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు పరశురామ్ డైరెక్షన్‌లో ‘సర్కారు వారి పాట’ అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కరోనా తీవ్రత తగ్గిన తర్వాతే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుండగా.. ప్రస్తుతం చిత్ర యూనిట్ పలు సెట్టింగ్స్‌పై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో కొన్ని సన్నివేశాలను హైదరాబాద్ లోనే చిత్రీకరిస్తున్నారు. ఇందుకుగాను ఓ భారీ సెట్ ను సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఈ సినిమా కథ మొత్తం బ్యాంకు చుట్టు తిరుగుతుంది. ఇందులో బ్యాంకులను బురిడీ కొట్టించి, వేలకోట్ల రూపాయల రుణాలు ఎగొట్టి విదేశాలు వెళ్లిన ఆర్థిక నేరగాళ్లను స్వదేశానికి రప్పించే కథానాయకుడిగా సూపర్ స్టార్ మహేశ్‌బాబు పాత్ర ఉంటుంది. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలను బ్యాంకులో షూట్ చేస్తున్నాయి.

వాటిని తెరకెక్కించడానికి హైదరాబాద్‌లోని ప్రముఖ స్టూడియోలో బ్యాంకు సెట్టు వేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కొన్ని రోజుల తర్వాత సెట్‌ వర్క్‌ ప్రారంభిస్తారని సమాచారం. పరశురామ్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌, 14 రీల్స్‌ ప్లస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది.