వావ్.. సమంత ‘యోగా’నందం
అక్కినేని వారి కోడలు సమంత టైమ్ ను సరిగ్గా వినియోగించుకుంటారు. సమయపాలన విషయంలోనూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటారు. అలాగే.. హెల్త్, ఫిట్‌నెస్ విషయంలోనూ అంతే జాగ్రత్తలు తీసుకుంటారు. నిత్యం ఫిజికల్ ఫిట్‌నెస్ పై స్పెషల్ ఫోకస్ పెడుతుంటారు. అయితే లాక్ డౌన్‌తో షూటింగ్‌లకు బ్రేక్ పడటంతో సమంత ఇంట్లోనే బిజీగా ఉంటున్నారు. కుటుంబ సభ్యులతో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. వంటలు చేస్తూ కుటుంబ సభ్యులను మెప్పిస్తున్నారు. అంతేకాదు… ఇంటి టెర్ర్‌సపై ఆర్గానిక్ వ్యవసాయం చేయడం, పోషక […]
అక్కినేని వారి కోడలు సమంత టైమ్ ను సరిగ్గా వినియోగించుకుంటారు. సమయపాలన విషయంలోనూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటారు. అలాగే.. హెల్త్, ఫిట్‌నెస్ విషయంలోనూ అంతే జాగ్రత్తలు తీసుకుంటారు. నిత్యం ఫిజికల్ ఫిట్‌నెస్ పై స్పెషల్ ఫోకస్ పెడుతుంటారు. అయితే లాక్ డౌన్‌తో షూటింగ్‌లకు బ్రేక్ పడటంతో సమంత ఇంట్లోనే బిజీగా ఉంటున్నారు. కుటుంబ సభ్యులతో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. వంటలు చేస్తూ కుటుంబ సభ్యులను మెప్పిస్తున్నారు. అంతేకాదు… ఇంటి టెర్ర్‌సపై ఆర్గానిక్ వ్యవసాయం చేయడం, పోషక విలువలున్న వంటలు చేయడం బాగా నేర్చుకుంటున్నారు. వీటన్నింటినీ.. తన ఫ్యాన్స్ కోసం సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.
తాజాగా ఆసనాలు వేస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతేకాదు ఆ ఫోటోకు చిన్న కామెంట్ కూడా జోడించారు. ‘‘గార్డెన్ వర్క్‌తోపాటు యోగా చేయడాన్ని నేను చాలా ఆస్వాదిస్తా… నేనూ, చైతూ కలిసి ప్రతిరోజు యోగా చేస్తాము. మాకు చక్కని యోగా శిక్షకుడు ఉన్నారు. ఈ ఫొటోలో చైతూ లేరు. నేను మాత్రమే వర్కవుట్స్ చేస్తున్నా’’ అని సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు.