అమానవీయ ఘటనపై సీఎం జగన్ సీరియస్

శ్రీకాకుళం జిల్లా, పలాసలో కోవిడ్ మృతదేహాన్ని జేసీబీతో తరలించిన ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. మానవత్వాన్ని చూపాల్సిన సమయంలో కొంతమంది వ్యవహరించిన తీరు...

అమానవీయ ఘటనపై సీఎం జగన్ సీరియస్
Follow us

|

Updated on: Jun 27, 2020 | 6:15 AM

కరోనా మృతుడిని జేసీబీలో తరలింపు ఘటనపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఓ వ్యక్తి కరోనా వైరస్ బారిన పడి చనిపోయారు. మరణిస్తే అతడి అంత్యక్రియలు అత్యంత ఘోరంగా నిర్విహించారు. కరోనాతో చనిపోతే కనికరం చూపలేదు. కోవిడ్ సోకితే దరిచేరేవారే కరువయ్యారు. కనీసం కుటుంబసభ్యులు, బంధువులు ఎవరూ అంత్యక్రియలు చేసేందుకు ముందుకు రాలేదు. ఇక అధికారులు సైతం అమానుషంగా ప్రవర్తించి ఆ పెద్దాయనను జేసీబీలో తరలించి దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై ఇప్పటికే ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు.

అయితే ఈ అమానవీయ ఘటనపై ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు స్పందించారు. కలెక్టర్ తో మాట్లాడారు.. అనంతరం విచారణ జరిపించాలని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఇద్దరు అధికారులపై వేటు వేశారు. అయితే ఇది అత్యంత అమానవీయ ఘటన అంటూ ముఖ్యమంత్రి జగన్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

ట్విట్టర్ లో.. “శ్రీకాకుళం జిల్లా, పలాసలో కోవిడ్ మృతదేహాన్ని జేసీబీతో తరలించిన ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. మానవత్వాన్ని చూపాల్సిన సమయంలో కొంతమంది వ్యవహరించిన తీరు బాధించింది. ఇలాంటి ఘటనలు మరెక్కడా పునరావృత్తం కాకూడదు. బాధ్యుల పై కఠిన చర్యలు తీసుకోకతప్పదు.” అని ట్వీట్ చేశారు.