కరోనా కాటుకు మాజీ ఆరోగ్య శాఖ మంత్రి మృతి

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటిని వణికిస్తోంది. సామాన్య ప్రజల నుంచి ప్రజాప్రతినిధుల వరకు అందరూ ఈ వైరస్ కాటుతో మరణిస్తున్నారు. ఇప్పటికే మన దేశంలో కరోనా బారినపడి పలువురు ప్రజాప్రతినిధులు..

కరోనా కాటుకు మాజీ ఆరోగ్య శాఖ మంత్రి మృతి
Follow us

| Edited By:

Updated on: Jul 06, 2020 | 11:29 PM

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటిని వణికిస్తోంది. సామాన్య ప్రజల నుంచి ప్రజాప్రతినిధుల వరకు అందరూ ఈ వైరస్ కాటుతో మరణిస్తున్నారు. ఇప్పటికే మన దేశంలో కరోనా బారినపడి పలువురు ప్రజాప్రతినిధులు మరణించారు. తాజాగా.. గోవా మాజీ ఆరోగ్య శాఖ మంత్రి సురేష్ అమెంకర్‌ కూడా కరోనా బారినపడి మరణించారు. ఈ విషయాన్ని గోవా ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. సురేష్ అమోంకర్ వయస్సు 68 ఏళ్లు. ఆయన గతంలో గోవా రాష్ట్ర బీజేపీకి అధ్యక్షుడిగా వ్యవహరించారు. అంతేకాదు.. గతంలో ఆయన ఆరోగ్య శాఖకు మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన మృతి పట్ల సీఎం ప్రమోద్ సవాంత్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు. పార్టీకి కానీ.. రాష్ట్రానికి కానీ ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని ట్వీట్‌లో పేర్కొన్నారు.