అంబులెన్స్ బోల్తా.. 12 మంది కరోనా బాధితులకు గాయాలు

మహారాష్ట్రలో దారుణం జరిగింది. కరోనా పేషేంట్లను తరిస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి. ఐసోలేషన్ వార్డుకు తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

  • Balaraju Goud
  • Publish Date - 11:18 pm, Mon, 6 July 20
అంబులెన్స్ బోల్తా.. 12 మంది కరోనా బాధితులకు గాయాలు

మహారాష్ట్రలో దారుణం జరిగింది. కరోనా పేషేంట్లను తరిస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి. ఐసోలేషన్ వార్డుకు తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

మ‌హారాష్ర్ట‌లోని పుణె – ముంబై ప్ర‌ధాన ర‌హ‌దారిపై క‌రోనా బాధితుల‌తో వెళ్తున్న ఓ అంబులెన్స్ వ్యాన్ అదుపుత‌ప్పి బోల్తా ప‌డింది. దీంతో 12 మంది కరోనా బాధితులకు గాయాలయ్యాయి.మహారాష్ట్ర వ్యాప్తంగా కరోనా విస్తరిస్తుండడంతో కొత్త కేసులతో ఆస్పత్రులు నిండిపోతున్నాయి. దీంతో సోమవారం కొందరిని సమీపంలోని మరో కొవిడ్ ఆస్పత్రికి రోగులను తరలిస్తున్నారు అధికారులు. ఇందులో భాగంగా 12 మంది క‌రోనా బాధితుల‌ను బావ్ ధాన్ లోని కొవిడ్-19 ఐసోలేష‌న్ సెంట‌ర్ కు తీసుకెళ్తున్నారు వైద్య సిబ్బంది. అయితే, అంబులెన్స్ ఒక్కసారిగా బోల్తా ప‌డి 12 మందికి గాయాలైన‌ట్లు పోలీసులు తెలిపారు. బాధితులంద‌రూ కొత్రూడ్ కు చెందిన వారిగా గుర్తించారు. గాయ‌ప‌డ్డ వారిని స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు.