యూఏఈ, శ్రీలంక తరువాత.. ఐపీఎల్ రేసులో న్యూజిలాండ్..
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు భారీగా నమోదవుతున్నాయి. ఇప్పటికే 7లక్షల వరకు కరోనా బాధితులను దేశవ్యాప్తంగా గుర్తించారు. ఈ క్రమంలో ఐపీఎల్ టోర్నీని విదేశాల్లో నిర్వహించాలని యోచిస్తున్న బీసీసీఐకి
New Zealand offers to host IPL: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు భారీగా నమోదవుతున్నాయి. ఇప్పటికే 7లక్షల వరకు కరోనా బాధితులను దేశవ్యాప్తంగా గుర్తించారు. ఈ క్రమంలో ఐపీఎల్ టోర్నీని విదేశాల్లో నిర్వహించాలని యోచిస్తున్న బీసీసీఐకి మరో ఆఫర్ వచ్చింది. ఐపీఎల్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు ఇప్పటికే యూఏఈ, శ్రీలంక ముందుకు రాగా, తాజాగా న్యూజిలాండ్ కూడా రేసులో దిగింది. కరోనా మహమ్మారి కారణంగా భారత్‌లో ఐపీఎల్ నిర్వహణ సాధ్యం కాకపోతే తాము ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు బీసీసీఐకి తెలియజేసింది.
భారత్ లోనే ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నా దేశంలో శరవేగంగా పెరుగుతున్న కేసులు ప్రపంచంలోనే భారత్‌ను మూడో స్థానంలో నిలబెట్టాయి. దీంతో సెప్టెంబరు చివర్లో, లేదంటే నవంబరు మొదట్లో ఐపీఎల్ నిర్వహించాలనుకున్న బీసీసీఐ ఆశలు దాదాపు అడుగంటాయి. యూఏఈ, శ్రీలంక తర్వాత ఇప్పుడు ఐపీఎల్‌కు ఆతిథ్యమిచ్చేందుకు న్యూజిలాండ్ ముందుకొచ్చిందని బీసీసీఐ పేర్కొంది. . ప్రస్తుతం న్యూజిలాండ్‌లో ఒకే ఒక్క కరోనా కేసు యాక్టివ్‌గా ఉంది.