AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా వైరస్.. అలాంటి మాస్క్‌లు వాడటం ఉత్తమం..!

కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఫేస్ మాస్క్‌లు వాడాలంటూ నిపుణులు సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే మన జీవితంలో మాస్క్‌లు ఒక భాగం అయిపోయాయి.

కరోనా వైరస్.. అలాంటి మాస్క్‌లు వాడటం ఉత్తమం..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 11, 2020 | 1:40 PM

Share

కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఫేస్ మాస్క్‌లు వాడాలంటూ నిపుణులు సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే మన జీవితంలో మాస్క్‌లు ఒక భాగం అయిపోయాయి. అయితే మాస్క్‌లు ఉపయోగించడంలోనూ ఇప్పటికే కొన్ని సూచనలు చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్‌ఓ.. ప్రస్తుత పరిస్థితుల్లో మాస్క్‌ల వినియోగానికి సంబంధించి మరిన్ని కొత్త సలహాలను విడుదల చేసింది. అందులో ఎలాంటి మెడికల్, నాన్‌ మెడికల్‌ మాస్క్‌లను ఉపయోగించాలి, వాటిని ఎలా తయారు చేసుకోవాలి, తదితర అంశాలను వెల్లడించింది. ఇక మాస్క్‌తో పాటు భౌతిక దూరం కచ్చితంగా పాటించాలని, తరచు చేతులను శుభ్రపరచుకుంటూ ఉండాలని సూచించింది.

ఏ పరిస్థితుల్లో ఎవరు మాస్క్‌ వాడాలి..?

నాన్‌ మెడికల్ మాస్క్‌: 1. సరుకుల దుకాణాలు, ప్రార్థన స్థలాలు, ఇలా జన సమూహాలున్న ప్రతి చోట మాస్క్‌ వాడాలి. 2.మురికివాడలు, ఇరుకు ప్రాంతాలున్న చోట మాస్క్‌ ధరించాలి. 3.భౌతిక దూరం సాధ్యం కాని ప్రదేశాలు, బస్సులు, రైళ్లు, విమానాల్లో ప్రయాణించే వారు, క్యాషియర్లు, సర్వర్లు, సోషల్‌ వర్కర్లు ఈ మాస్క్‌ను ధరించాలి.

మెడికల్‌ మాస్క్‌: 1. భౌతికదూరం పాటించడం సాధ్యం కాని ప్రదేశాల్లో, వైరస్‌ సోకే అవకాశాలున్న చోట, 60 ఏళ్లకు పైబడిన వారు, గుండెజబ్బులు, డయాబెటిస్‌, క్యాన్సర్, శ్వాసకోశ సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు వీటిని వాడటం ఉత్తమం. 2. కరోనా లక్షణాల్లో ఏవైనా ఉన్నవారు, వ్యాప్తి నియంత్రణకు మెడికల్‌ మాస్క్‌ ధరించాలి.

మాస్క్‌ని వాడటం ఇలా.. 1. మాస్క్‌ పెట్టుకునే ముందు చేతులు శుభ్రపరచుకోవాలి. 2. నోరు, ముక్కు కవర్‌ అయ్యేలా మాస్క్‌ని ధరించాలి. ముఖం, మాస్క్‌ మధ్య గ్యాప్‌ ఉండకుండా వెనుకవైపు ముడేసుకోవాలి. 3. మాస్క్‌ని పదేపదే తాకరాదు. 4. చేతులతో తాకకుండా, వెనుక నుంచి మాస్క్‌ విప్పేలా ఏర్పాటు చేసుకోవాలి. 5. మాస్క్‌లను విప్పిన వెంటనే శానిటైజర్‌ లేదా సబ్బుతో శుభ్రపరచుకోవాలి. 6. సింగిల్‌ యూజ్‌ మాస్క్‌లను ఒకసారి కంటే ఎక్కువ ఉపయోగించకూడదు. వాడిన వెంటనే వాటిని పారేయాలి.

మాస్క్‌లని ఎలా తయారుచేయాలంటే.. 1. కనీసం మూడు పొరలు ఉండేలా మాస్క్‌లు తయారు చేయాలి. నోటికి తగిలేలా ఇన్నర్‌ లేయర్‌ ఫ్యాబ్రిక్, బయటి పొర బయటి వాతావరణానికి ఇమిడేలా ఉండాలి. 2. నీటిని పీల్చగలిగే మెటీరియల్‌తో మాస్క్‌లని తయారు చేయడం ఉత్తమం. బయటి పొర లిక్విడ్ పీల్చుకునే గుణం లేనిది అయ్యి ఉండాలి.

మాస్క్‌ల నిర్వహణ ఇలా ఉండాలి..

1. ఒక మాస్క్‌ను ఒక్కరే ఉపయోగించాలి. 2. మాసిపోయినప్పుడు లేదా తడిసినప్పుడు మాస్క్‌లను మార్చాలి. తడిచిన వాటిని ఎక్కువ కాలం ఉపయోగించకూడదు. 3. నాన్‌ మెడికల్‌ మాస్క్‌లను తరచుగా ఉతుకుతూ ఉండాలి. 4. ఎక్కువ వేడిలో ఉతికినా తట్టుకునేలా మెటీరియల్ ఎంచుకోవాలి. 5. వేడి నీళ్లతో మాస్క్‌లను ఉతకాలి. అవి అందుబాటులో లేని సమయంలో సబ్బు, డిటర్జెంట్‌తో మాస్క్‌ని శుభ్రపరచుకోవాలి.

Read This Story Also: సీఎం దేవుడు.. అసలు జరిగింది ఇదే: డాక్టర్ సుధాకర్

Follow Us
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు
గ్రీన్ టీ ప్రతిరోజూ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుస
గ్రీన్ టీ ప్రతిరోజూ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుస
జూలై 23 దినఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ధన యోగం.. మీ రాశి ఎలా?
జూలై 23 దినఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ధన యోగం.. మీ రాశి ఎలా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?