దేశంలో ‘సామాజిక వ్యాప్తి’ ఎప్పుడో మొదలైంది: వైద్య నిపుణుల హెచ్చరిక

రోజురోజుకు దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. దేశంలో సామాజిక వ్యాప్తి జరగడం లేదన్న భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) వ్యాఖ్యలపై వైద్య నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దేశంలో 'సామాజిక వ్యాప్తి' ఎప్పుడో మొదలైంది: వైద్య నిపుణుల హెచ్చరిక
Follow us

| Edited By:

Updated on: Jun 14, 2020 | 1:05 PM

రోజురోజుకు దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. దేశంలో సామాజిక వ్యాప్తి జరగడం లేదన్న భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) వ్యాఖ్యలపై వైద్య నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక వ్యాప్తిపై ప్రభుత్వాలు అంగీకరించాలని, అప్పుడే ప్రజలు అప్రమత్తంగా ఉంటారని వారు చెబుతున్నారు. దేశంలో చాలా ప్రాంతాల్లో సామాజిక వ్యాప్తి స్థాయికి కరోనా మహమ్మారి చేరిందని వారు అంటున్నారు.

దేశంలో లాక్‌డౌన్ సడలింపు తరువాత భారీగా వలసలు జరిగాయి. దీంతో వైరస్ వ్యాప్తి వేగంగా జరిగింది. అంతకుముందు కేసులు లేని ప్రదేశాల్లో కూడా కొత్త కేసులు వస్తున్నాయి. ఈ విషయాన్ని ప్రభుత్వం గమనించాలి అని ఎయిమ్స్‌ మాజీ డైరెక్టర్ ఎం.సి. మిశ్ర తెలిపారు. భారత్‌లో చాలా రోజుల క్రితమే సామాజిక వ్యాప్తి దశకు చేరిందని వైరాలజిస్ట్ షాహిద్ జమీల్ తెలిపారు. కానీ ఆరోగ్య సంస్థలు దీన్ని అంగీకరించడం లేదని ఆయన అన్నారు. కరోనా వ్యాప్తిపై ఐసీఎంఆర్ నిర్వహించిన సర్వే ప్రకారం చూసుకున్నా.. కరోనా బాధితుల్లో 40శాతం మంది విదేశాల నుంచి వచ్చిన వారు కాదని, వారికి వ్యాధి ఎవరి ద్వారా వచ్చిందో కూడా తెలియడం లేదని, ఇది కచ్చితంగా సామాజిక వ్యాప్తి దశనే అని షాహిద్ జమీల్ వెల్లడించారు. ఇక ఐసీఎంఆర్ జరిపిన సర్వేలో ఏప్రిల్ నాటి లెక్కలు ఉన్నాయని, దాని ఆధారంగా దేశంలో ప్రస్తుతం సామాజిక వ్యాప్తి లేదని చెప్పడం తప్పని ఊపిరితిత్తుల వైద్యుల నిపుణుడు అరవింద్ కుమార్ అన్నారు.

Read This Story Also: ప్రభాకర్ రెడ్డి, అస్మిత్‌ రెడ్డిల రిమాండ్ ఖైదీ నంబర్లు ఇవే