AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్: తెలంగాణ సచివాలయంలో మరో కరోనా కేసు.. ఉలిక్కిపడుతోన్న ఉద్యోగులు

తెలంగాణ సచివాలయంలో ఉద్యోగులను కరోనా వైరస్ కలవరపెడుతోంది. తాజాగా ఆదివారం సచివాలయంలోని ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చింది. టీఎస్ సెక్రటేరియట్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళకు ఈ వైరస్ సోకింది. ఐటీ శాఖలో పనిచేస్తన్న పొరుగుసేవల సిబ్బందిలో ఓ మహిళా ఉద్యోగికి...

బ్రేకింగ్: తెలంగాణ సచివాలయంలో మరో కరోనా కేసు.. ఉలిక్కిపడుతోన్న ఉద్యోగులు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 14, 2020 | 1:01 PM

Share

తెలంగాణ సచివాలయంలో ఉద్యోగులను కరోనా వైరస్ కలవరపెడుతోంది. తాజాగా ఆదివారం సచివాలయంలోని ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చింది. టీఎస్ సెక్రటేరియట్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళకు ఈ వైరస్ సోకింది. ఐటీ శాఖలో పనిచేస్తన్న పొరుగుసేవల సిబ్బందిలో ఓ మహిళా ఉద్యోగికి కోవిడ్ నిర్థారణ అయింది. గత ఐదు రోజులుగా సదరు ఉద్యోగి విధులకు హాజరు కావడం లేదు. లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్ష చేయిస్తే పాజిటివ్ వచ్చినట్లు తేలింది. దీంతో వెంటనే ఆమె పని చేసే ఫ్లోర్ మొత్తం శానిటైజ్ చేయించారు అధికారులు. అలాగే ఆమెతో ఇంటరాక్ట్ అయిన మిగిలిన ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా ప్రస్తుతం బీఆర్కే భవన్‌లోకి సందర్శకులను కూడా అనుమతించడం లేదు. అత్యవసర పనులపై వచ్చే వారైతే సంబంధిత అధికారుల అనుమతితోనే లోపలికి పంపిస్తున్నారు.

ఇక తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా శనివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 253 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు కరోనాతో ఎనిమిది మంది బాధితులు మృతి చెందారు. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కరోనా వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,737కు చేరింది. అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 182 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 2.352 మంది బాధితులు కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 2,203 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Read More: 

తెరుచుకున్న శబరిమల ఆలయం.. కానీ భక్తులకు నో ఎంట్రీ..

హైపర్ ఆదికి అనసూయ బంపర్ ఆఫర్.. తనతో సమానంగా రెమ్యునరేషన్..

అసభ్యంగా ప్రవర్తించాడని.. కొడుకుపైనే కేసు పెట్టిన నటి

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్