కల్నల్ సంతోష్‌బాబు పేరిట కోవిడ్ ఐసీయూ వార్డ్!

గాల్వన్ లోయలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమ‌ర‌వీరుడు కల్నల్ సంతోష్ బాబు త్యాగానికి భార‌త‌దేశం మొత్తం గ‌ర్వ‌ప‌డింది. భార‌తీయులంద‌రూ ఆ అమ‌ర‌వీరుడికి ఘన నివాళులర్పించారు. కరోనా నేపథ్యంలో కల్నల్ సంతోష్ బాబు పేరును కోవిడ్ఐ సీయూ వార్డుకు పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు డీఆర్‌డీఓ..

కల్నల్ సంతోష్‌బాబు పేరిట కోవిడ్ ఐసీయూ వార్డ్!
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 04, 2020 | 6:08 PM

గాల్వన్ లోయలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమ‌ర‌వీరుడు కల్నల్ సంతోష్ బాబు త్యాగానికి భార‌త‌దేశం మొత్తం గ‌ర్వ‌ప‌డింది. భార‌తీయులంద‌రూ ఆ అమ‌ర‌వీరుడికి ఘన నివాళులర్పించారు. తెలంగాణ ప్ర‌జ‌ల‌తో పాటు దేశవాసులు అందరూ కూడా ఆ కుటుంబానికి బాస‌ట‌గా నిలిచారు. సంతోష్ బాబుకు మ‌ర‌ణ‌మ‌నేది లేద‌ని బార‌తీయుల గుండెల్లో ఎప్ప‌టికి ఆయ‌న త్యాగం అలానే ఉంటుంద‌ని కోనియాడారు. సంతోష్ బాబు కుటుంబాన్ని స్వయంగా కలిసి పరామర్శించి సీఎం కేసీఆర్ వారికి సాయం అందజేశారు. ఇదిలా ఉంటే సంతోష్ బాబు పేరిట డీఆర్‌డీవో ఆధ్వర్యంలో కోవిడ్ బాధితుల కోసం ప్రత్యేకించి ఓ వార్డునే ఏర్పాటు చేశారు.

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని సర్ధార్‌ వల్లభాయ్ పటేల్ కోవిడ్ దవాఖానలోని వివిధ వార్డులకు గాల్వన్ లోయలో వీర మరణం పొందిన వారి పేర్లను పెట్టాలని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ డీఆర్‌డీవో నిర్ణయం తీసుకుంది. అమరవీరుల గుర్తుగా ఈ పేర్లను పెడుతున్నట్లు డీఆర్‌డీవో అధికారులు వెల్లడించారు. కాగా కల్నల్ సంతోష్ బాబు పేరును ఐసీయూ వార్డుకు పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు డీఆర్‌డీఓ ఛైర్మెన్ సంజీవ్ జోషి వెల్లడించారు. 10వేల పడకలు గల ఈ హాస్పిటల్ ను కరోనా బాధితులకోసం నిర్మించారు. ఆస్పత్రిని అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ లు కలిసి ఆదివారం ప్రారంభించనున్నారు. కోవిడ్ ఆస్పత్రిలోని వార్డులకు అమరుల పేర్లను పెట్టడంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, కల్నల్‌ సంతోష్‌ బాబు తెలంగాణ రాష్ట్రం సూర్యపేట వాసి. బిహార్ 16వ బెటాలియన్‌లో కల్నల్ ర్యాంకులో పనిచేస్తున్నారు. సంతోష్‌కు 3 నెలల క్రితమే హైదరాబాద్‌కు బదిలీ అయినప్పటికీ.. లాక్‌డౌన్ కారణంగా సంతోష్ అక్కడే విధుల్లో ఉండగా వీరమరణం పొందిన సంగతి తెలిసిందే.