క‌రోనా క‌ట్ట‌డి కోసం ధ‌న్వంత‌రి యాగం

క‌రోనా మ‌హ‌మ్మారి భార‌త్‌లోనూ క‌రాళ నృత్యం చేస్తోంది. వ్యాక్సిన్ త‌యారీలో ప్ర‌పంచ శాస్త్ర‌వేత్త‌ల‌తో పాటుగా భార‌త సైంటిస్టులు కూడా నిరంత‌ర పోరాటం చేస్తున్నారు. మ‌రోవైపు భారత్‌లో అనేక ప్రాంతాల్లో పూజలు పునస్కారాలు చేస్తున్నారు. కరోనా పోవాలంటూ వేడుకుంటున్నారు.

క‌రోనా క‌ట్ట‌డి కోసం ధ‌న్వంత‌రి యాగం
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 16, 2020 | 8:32 PM

ప్ర‌పంచ దేశాల‌ను వ‌ణికిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారి భార‌త్‌లోనూ క‌రాళ నృత్యం చేస్తోంది. ప్రాణాంత‌క వైర‌స్‌ని అంత‌మొందించ‌గ‌ల స‌రైన వ్యాక్సిన్ ఇంత‌వ‌ర‌కు అందుబాటులోకి రాక‌పోవ‌టంతో ల‌క్ష‌ల సంఖ్య‌లో బాధితులు వైర‌స్ బారిన‌ప‌డుతుండ‌గా, అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వ్యాక్సిన్ త‌యారీలో ప్ర‌పంచ శాస్త్ర‌వేత్త‌ల‌తో పాటుగా భార‌త సైంటిస్టులు కూడా నిరంత‌ర పోరాటం చేస్తున్నారు. మ‌రోవైపు భారత్‌లో అనేక ప్రాంతాల్లో పూజలు పునస్కారాలు చేస్తున్నారు. కరోనా పోవాలంటూ వేడుకుంటున్నారు.
భార‌త్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు వేగంగా పెరుగుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు ఆస్పత్రుల్లో కరోనా రోగుల కోసం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నాయి. అయినా కరోనా కేసుల సంఖ్య పెరుగడమే తప్ప తగ్గడంలేదు. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారి తగ్గిపోవాలని కోరుతూ కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని శంకర్‌మఠ్‌లో ధన్వంతరీ యాగం నిర్వహించారు. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్ప, ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కే సుధాకర్‌ ఈ యాగంలో పాల్గొన్నారు. గతంలో తిరుమల ఆలయంలో కూడా ధన్వంతరి యాగం నిర్వహించారు.