కరోనా బాధితులు తినే ఆహారం ఇదే

కట్టడి చేయడానికి ప్రధానాంశం. ఇమ్యునిటీ(వ్యాధినిరోధక శక్తి)ని పెంచుకోవడమే. కూరగాయలు, పండ్లు, ద్రవాలు ఇలా అవన్నింటినీ పాటించి కరోనాను దూరం చేసుకోండి. మరి కరోనావైరస్ వచ్చినవారు ఎలాంటి ఆహారం తీసుకుంటారో..

కరోనా బాధితులు తినే ఆహారం ఇదే
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 24, 2020 | 3:52 PM

కరోనా.. కరోనా.. ఇప్పుడు ఎవరి నోటి వెంట విన్నా ఇదే మాట. దీని పేరు ఎత్తితేనే ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దీని బారిన పడి 13 వేల మందికి పైగా మరణించారు. ఇప్పుడు ఇండియాలోనూ దీని ప్రభావం తీవ్రంగా ఉంది. రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ అవుతున్నావు. దీంతో.. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలను లాక్‌డౌన్ చేశారు.. ఇరు రాష్ట్రాల సీఎంలు. ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రానీయకుండా అన్ని రకాల చర్యలనూ తీసుకుంటున్నారు. అందులోనూ తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 36కి చేరింది.

అయితే కరోనాను కట్టడి చేయడానికి ప్రధానాంశం. ఇమ్యునిటీ(వ్యాధినిరోధక శక్తి)ని పెంచుకోవడమే. కూరగాయలు, పండ్లు, ద్రవాలు ఇలా అవన్నింటినీ తీసుకుని కరోనాను దూరం చేసుకోవడం ఒకటే మార్గం. అలాగే కరోనావైరస్ వచ్చినవారు ఎలాంటి ఆహారం తీసుకుంటారో అన్న విషయం అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరి వారు ఏ ఆహారం తీసుకుంటారో మీకు తెలుసా? వారు తీసుకునే ఫుడ్ ఏంటనేది ఇప్పటికే సోషల్ మీడియాలో పలు వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. వారు తినే ఆహారం సాత్వికంగా ఉంటుంది. ఎందుకంటే.. కరోనా వైరస్ ముదిరిన తరువాత బాధితులు ఫుడ్ తీసుకోవడం కష్టంగా ఉంటుంది కాబట్టి.

కరోనా బాధితుల ఆహారం:

ఉదయం: ఇడ్లీ, మినప, పెసర దోస, మినప వడ, గోధుమ రవ్వ ఉప్మా, కాఫీ, వాటర్ మధ్యాహ్నం భోజనం: గుడ్డు, ఆకుకూరలు, మిక్సెడ్ వెజిటెబుల్ కర్రీ, సాంబారు, పెరుగు, అరటి పండు స్నాక్స్: వివిధ రకాల 100 గ్రాముల డ్రై ఫ్రూట్స్, బత్తాయిలు, అరటి, యాపిల్స్, కాఫీ, గ్రీన్, లెమన్‌ టీలు రాత్రి భోజనం: గుడ్డు, పప్పు, రసం, పెరుగు, శాకాహార కూరలు అల్పాహారంలో రోజుకొక ఐటెమ్ వారికి అందిస్తారు.

Read more also: రీజన్ లేకుండా.. రోడ్డెక్కితే అంతే.. ప్రజలకు సీరియస్ వార్నింగ్

మీరు సూపరంటూ కేసీఆర్‌ని పొగిడేసిన అమిత్‌ షా

కరోనాను జయించాలంటే.. ఈ డైట్‌ని మెయిన్‌టైన్ చేయాల్సిందే

కరోనా రూపంలో.. చిత్ర సీమకు తీవ్ర నష్టం

నగదు.. బియ్యం పంపిణీ ఎలా చేస్తారు?