కరోనా ఎఫెక్ట్‌.. ఆ జైలు నుంచి 3000 మంది ఖైదీలు విడుదల..!

భారత్ లో కోవిద్ 19 విజృంభణతో వాణిజ్య, ఉత్పాదక​ కార్యకలాపాలు స్తంభించాయి. పలు కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయాలని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో సుమారు 3000 ఖైదీలను విడుదల

కరోనా ఎఫెక్ట్‌.. ఆ జైలు నుంచి 3000 మంది ఖైదీలు విడుదల..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 24, 2020 | 4:50 PM

Tihar jail: భారత్ లో కోవిద్ 19 విజృంభణతో వాణిజ్య, ఉత్పాదక​ కార్యకలాపాలు స్తంభించాయి. పలు కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయాలని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో సుమారు 3000 ఖైదీలను విడుదల చేయడానికి తిహార్ జైలు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ”సుమారు 1,500 ఖైదీలను పెరోల్‌పైన, అదే సంఖ్యలో అండర్‌ ట్రయల్‌ ఖైదీలను మధ్యంతర బెయిల్‌పై రానున్న మూడు, నాలుగు రోజుల్లో విడుదల చేస్తాం. కరోనా వైరస్‌ (కొవిడ్-19) నేపథ్యంలో జైళ్లలో రద్దీని అరికట్టడానికి ఈ చర్యలు తీసుకుంటున్నాం.” అని జైళ్లశాఖ డైరక్టర్‌ జనరల్‌ సందీప్‌ గోయల్‌ ప్రకటించారు. అయితే విడుదలయ్యే వారిలో తీవ్ర నేరాలు చేసినవారు, కరడుగట్టిన ఖైదీలు ఉండరని ఆయన వివరించారు.

భారత్ లో కరోనా మహమ్మారి పంజా విసురుతూనే ఉంది. అయితే దేశవ్యాప్తంగా ఉన్న 1,339 జైళ్లలో వాటి సామర్థ్యానికి మించి 4,66,084 మంది ఖైదీలు ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఖైదీలకే కాకుండా జైలు సిబ్బంది, సందర్శకులు, న్యాయవాదులకు కూడా కరోనా ముప్పు పొంచి ఉంది. జైళ్లలోని ఖైదీలకు కూడా కొవిడ్‌-19 సోకే అవకాశముందనే వాదనను సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో సుప్రీం ఆదేశానుసారం.. ఏడు సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశమున్న ఖైదీలను విడుదల చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తిహార్ జైలు అధికారులు వివరించారు. కాగా, వీరిని నాలుగు నుంచి ఆరు వారాల పాటు పెరోల్‌పై విడిచిపెట్టే అవకాశముంది.

60కు చేరువైనా పెళ్లి ఊసెత్తని సల్మాన్.. అసలు విషయం ఇదే!
60కు చేరువైనా పెళ్లి ఊసెత్తని సల్మాన్.. అసలు విషయం ఇదే!
మీరు కూడా మహా కుంభమేళకు వెళ్తున్నారా..? ఈ చారిత్రక ప్రదేశాలను
మీరు కూడా మహా కుంభమేళకు వెళ్తున్నారా..? ఈ చారిత్రక ప్రదేశాలను
దైవ దర్శనానికి వచ్చి విగతజీవులుగా మారిన కుటుంబం..!
దైవ దర్శనానికి వచ్చి విగతజీవులుగా మారిన కుటుంబం..!
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
"సచిన్ కో బోలో": యోగరాజ్ వ్యాఖ్యలతో క్రికెట్ లో కొత్త చర్చలు
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు