కరోనా ఎఫెక్ట్.. బ్రీత్ ఎనలైజర్ టెస్ట్‌లకు స్వస్తి.. ఎప్పటివరకంటే..?

కరోనా వైరస్ రోజురోజుకు వ్యాప్తి చెందుతుండటంతో.. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయి. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అనేక చర్యలు తీసుకుంటూ.. ప్రజల్లో అవగాహన వచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ హైకోర్టు పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. విమానాశ్రయాల్లో ఎయిర్ ట్రాఫిక్ అధికారులు చేస్తున్న బ్రీత్  ఎనలైజర్ పరీక్షలను.. ఈ నెల 27వతేదీ వరకు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. కరోనా మహమ్మారి వ్యాప్తిచెందుతుండటంతో..ట్యూబ్ పద్ధతిలో బ్రీత్ ఎనలైజర్ టెస్టులు  చేయకుండా.. […]

కరోనా ఎఫెక్ట్.. బ్రీత్ ఎనలైజర్ టెస్ట్‌లకు స్వస్తి.. ఎప్పటివరకంటే..?
Follow us

| Edited By:

Updated on: Mar 24, 2020 | 2:36 PM

కరోనా వైరస్ రోజురోజుకు వ్యాప్తి చెందుతుండటంతో.. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయి. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అనేక చర్యలు తీసుకుంటూ.. ప్రజల్లో అవగాహన వచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ హైకోర్టు పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. విమానాశ్రయాల్లో ఎయిర్ ట్రాఫిక్ అధికారులు చేస్తున్న బ్రీత్  ఎనలైజర్ పరీక్షలను.. ఈ నెల 27వతేదీ వరకు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. కరోనా మహమ్మారి వ్యాప్తిచెందుతుండటంతో..ట్యూబ్ పద్ధతిలో బ్రీత్ ఎనలైజర్ టెస్టులు  చేయకుండా.. తాత్కాలికంగా నిషేధించాలని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ గిల్డ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు మార్చి 27వ తేదీ వరకు  చేయవద్దంటూ ఆదేశాలిచ్చింది. అంతేకాదు.. ఈ పరీక్షలు  నిర్వహించేందుకు.. ట్యూబ్ సాయంతో కాకుండా ప్రత్యామ్నాయ పద్ధతుల కోసం.. వైద్యఆరోగ్య శాఖ డైరెక్టరు జనరల్ అత్యవసర సమావేశం నిర్వహించాలని కూడా ఆదేశించింది.