కరోనా నుంచి కోలుకున్న ఢిల్లీ మంత్రి సత్యేందర్..

ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్‌కు కరోనా నెగిటివ్ వచ్చింది. దీంతో ఆయన శుక్రవారం రాత్రి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని వైద్యులు పేర్కొన్నారు. మంత్రి సత్యేందర్‌కు ఈ నెల 17న కరోనా రావడంతో ఢిల్లీలోని రాజీవ్‌గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరారు. తీవ్ర జ్వరం, శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఐసీయూలో చికిత్స అందించారు వైద్యులు. కాగా అనంతరం ఆయనకి ప్లాస్మా చికిత్స చేయడంతో ఆయన ఆరోగ్యం మెరుగు పడిందని […]

  • Tv9 Telugu
  • Publish Date - 5:51 pm, Fri, 26 June 20
కరోనా నుంచి కోలుకున్న ఢిల్లీ మంత్రి సత్యేందర్..

ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్‌కు కరోనా నెగిటివ్ వచ్చింది. దీంతో ఆయన శుక్రవారం రాత్రి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని వైద్యులు పేర్కొన్నారు. మంత్రి సత్యేందర్‌కు ఈ నెల 17న కరోనా రావడంతో ఢిల్లీలోని రాజీవ్‌గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరారు. తీవ్ర జ్వరం, శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఐసీయూలో చికిత్స అందించారు వైద్యులు. కాగా అనంతరం ఆయనకి ప్లాస్మా చికిత్స చేయడంతో ఆయన ఆరోగ్యం మెరుగు పడిందని వైద్యులు తెలిపారు. ఐసీయూ నుంచి జూన్ 22న సాధారన వార్డుకు మంత్రి సత్యేందర్‌ను తరలించారు.

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రతీ రోజూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 17,296 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 407 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తంగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,90,401కి చేరుకుంది. ఇందులో 1,89,463 యాక్టివ్ కేసులు ఉండగా.. 15,301 మంది కరోనాతో మరణించారు. అటు 2,85,637 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో 13,941‬ మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 73,780 కేసులు, 2,429 మరణాలు సంభవించాయి.

Read More: 

నాసా బంపర్ ఆఫర్.. మూన్‌పై టాయిలెట్‌ కట్టేందుకు బెస్ట్ ఐడియా ఇస్తే..

‘గూగుల్ పే’లో కొత్త ఫీచర్.. అప్పులు ఇచ్చేందుకు సిద్ధం..

వీడియో వైరల్: బుల్లెట్ నడుపుతూ బోర్లాపడ్డ జెర్సీ హీరోయిన్..

బ్రేకింగ్: మరో సీరియల్ నటుడికి కరోనా.. షూటింగ్ రద్దు