తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా కేసులు ఇలా…

తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా వైర‌స్ వ్యాప్తి కొన‌సాగుతోంది. అయితే, తెలంగాణ‌కు కాస్తా ఊర‌ట‌నిస్తున్న కోవిడ్ భూతం..ఏపీని మాత్రం ప‌ట్టి పీడిస్తోంది........

తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా కేసులు ఇలా…
Follow us

|

Updated on: Apr 30, 2020 | 12:28 PM

తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా వైర‌స్ వ్యాప్తి కొన‌సాగుతోంది. అయితే, తెలంగాణ‌కు కాస్తా ఊర‌ట‌నిస్తున్న కోవిడ్ భూతం..ఏపీని మాత్రం ప‌ట్టి పీడిస్తోంది. లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ఎంత క‌ట్టుదిట్టంగా అమ‌లు చేస్తున్న‌ప్ప‌టికీ వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజు 70కి దిగ‌టం లేదు. ఓ వైపు లాక్‌డౌన్ ముగింపు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌గా,  ఏపీలో మాత్రం అంత‌కంత‌కూ పెరిగిపోతున్న కేసుల లెక్క‌లు ప్ర‌జ‌ల‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

తెలంగాణ‌లో వైర‌స్ త‌గ్గుముఖం ప‌ట్టిన‌ట్లుగానే క‌నిపిస్తోంది. బుధ‌వారం కేవ‌లం రాష్ట్రంలో కొత్త‌గా ఏడు కేసులు మాత్ర‌మే న‌మోద‌య్యాయి. ఈ ఏడు కేసులు కూడా గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధికి చెందిన‌విగా అధికారులు వెల్ల‌డించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1016కు చేరింది. వైర‌స్ బారిన ప‌డి 25 మంది మ‌ర‌ణించారు. కాగా బుధ‌వారం రోజున 14 మంది చిన్నారులు స‌హా, 35 మందిని ఆస్ప‌త్రి నుంచి  డిశ్చార్జ్ చేసిన‌ట్లు వైద్యాధికారులు వెల్ల‌డించారు.  ఇదిలా ఉంటే రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ప‌లు జిల్లాల్ని క‌రోనా ఫ్రీ జిల్లాలుగా ప్ర‌క‌టించింది రాష్ట్ర ఆరోగ్య‌శాఖ‌. క‌రోనా పాజిటివ్ ఆక్టివ్ కేసులు లేకుండా ఉన్న జిల్లాలు 11 ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. క‌రోనా ఫ్రీ జిల్లాలుగా సిద్దిపేట‌, మ‌త‌హ‌బూబాబాద్‌, మంచిర్యాల‌, యాదాద్రి భువ‌న‌గిరి, నారాయ‌ణ‌పేట‌, వ‌న‌ప‌ర్తి, పెద్ద‌ప‌ల్లి, వ‌రంగ‌ల్ రూర‌ల్‌, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం, నాగ‌ర్ క‌ర్నూల్‌, ములుగు జిల్లాల్లో క‌రోనా ఆక్టివ్ కేసులు లేకుండా ఉన్నాయి. ఈ జిల్లాలో క‌రోనా సోకిన వారంద‌రూ చికిత్స అనంత‌రం పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యి ఇళ్ల‌కు చేరిన‌ట్లుగా అధికారులు వెల్ల‌డించారు.

ఇక, ఏపీని క‌రోనా వైర‌స్ వెంటాడుతోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత వారం రోజులుగా పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 71 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇంత వరకూ మొత్తం కరోనా కేసుల సంఖ్య 1403కు చేరింది. కరోనా కారణంగా ఇంత వరకూ 31 మంది మరణించారు. గత 24 గంటలలో అత్యధికంగా కర్నూలు  జిల్లాలో 43  కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కర్నూలు  జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 386కుపెరిగింది.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?