AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క‌రోనా నెం.1 రాష్ట్రంలో 10వేల‌కు చేరువ‌లో పాజిటివ్‌ కేసులు

మ‌హారాష్ట్ర‌లో క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తోంది. రోజురోజుకూ కోవిడ్ మ‌హ‌మ్మారి ఉగ్ర‌రూపం ప్ర‌ద‌ర్శిస్తోంది. దేశంలో మొత్తంలో..

క‌రోనా నెం.1 రాష్ట్రంలో 10వేల‌కు చేరువ‌లో పాజిటివ్‌ కేసులు
Jyothi Gadda
|

Updated on: Apr 30, 2020 | 1:53 PM

Share
మ‌హారాష్ట్ర‌లో క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తోంది. రోజురోజుకూ కోవిడ్ మ‌హ‌మ్మారి ఉగ్ర‌రూపం ప్ర‌ద‌ర్శిస్తోంది. దేశంలో మొత్తంలో అత్య‌ధిక క‌రోనా కేసుల‌తో మ‌హారాష్ట్రం ప్ర‌థ‌మ స్థానంలో ఉంది. ఇక్క కేసుల సంఖ్య ప్ర‌స్తుతం 10వేల‌కు చేరువ‌లో ఉంది.
భార‌త్‌లో క‌రోనా వైర‌స్ వ్యాప్తి కొన‌సాగుతోంది. కోర‌లు చాస్తున్న కోవిడ్ మ‌హ‌మ్మారి ప్ర‌జ‌ల‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. దేశంలో ఇప్ప‌టికీ  కరోనా వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య వెయ్యి దాటింది. దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 31,787కు చేరగా.. మరణాల సంఖ్య 1008గా నమోదైంది. గత 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో 71 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇందులో 31 మంది మహారాష్ట్రలోనే చనిపోయారు. మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 400ల‌కు చేరింది.
మ‌హారాష్ట్ర‌లో క‌రోనా బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతున్న‌ది. ఇప్ప‌టికే అక్క‌డ న‌మోద‌వుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య 10 వేల‌కు చేరువ‌య్యింది. దేశవ్యాప్తంగా చూసిన‌ప్పుడు మ‌హారాష్ట్ర‌లో క‌రోనా ప్ర‌భావం చాలా ఎక్కువ‌గా ఉంది. ఇక ముంబ‌యి, పుణేలో ప‌రిస్థితి దారుణంగా ఉంది. పుణేలో బుధ‌వారం సాయంత్రానికే కేసుల సంఖ్య 1,595కు చేర‌గా.. గ‌త 12 గంట‌ల్లో మ‌రో 127 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో పుణే న‌మోదైన మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1722కు చేరింది. కాగా, జిల్లాలో ఒక్క‌రాత్రిలోనే 100కు పైగా కేసులు న‌మోదుకావ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంద‌ని పుణే జిల్లా ఆరోగ్య అధికారి భ‌గ‌వాన్ ప‌వార్ పేర్కొన్నారు.