AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid Vaccine India: అందరికీ ఆరోగ్యం.. అందుకే వ్యాక్సిన్.. దేశవ్యాప్తంగా వేగం పుంజుకున్న టీకా పంపిణీ

దేశంలో వ్యాక్సినేషన్ యజ్ఞంలా సాగుతోంది. వ్యాక్సిన్ వేయించుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అందరికీ వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం.. టీవీ9 నినాదం.. దేశం విధానం.

Covid Vaccine India: అందరికీ ఆరోగ్యం.. అందుకే వ్యాక్సిన్.. దేశవ్యాప్తంగా వేగం పుంజుకున్న టీకా పంపిణీ
Corona Vaccine
Balaraju Goud
|

Updated on: Jun 02, 2021 | 5:27 PM

Share

Covid Vaccine India: దేశంలో వ్యాక్సినేషన్ యజ్ఞంలా సాగుతోంది. వ్యాక్సిన్ వేయించుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అందరికీ వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం.. టీవీ9 నినాదం.. దేశం విధానం. మరి ఇప్పటి వరకు దేశంలో ఎంత మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది? వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఎంత మంది? దేశంలో వ్యాక్సినేషన్‌కు సంబంధించిన ఫుల్‌ డీటేల్స్ ఇప్పుడు చూద్దాం.

Covid Vaccine

Covid Vaccine

దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 21 కోట్ల 48 లక్షల 73 వేల 296 మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది. అందులో 17 కోట్ల 11 లక్షల 40 వేల 588 మందికి మొదటి డోస్‌ అందగా.. 4 కోట్ల 37 లక్షల 32 వేల 708 మందికి రెండో డోస్‌ కూడా పూర్తైంది. ఇవాళ ఇప్పటి వరకు 7 లక్షల 23 వేల 201 మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయింది.

తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు జనం. ఏపీలో ఇప్పటి వరకు కోటి ఒక లక్షా 21 వేల 738 మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది. 75 లక్షల 86 వేల 503 మందికి మొదటి డోస్‌ అందగా.. 25 లక్షల 35 వేల 235 మందికి రెండో డోస్‌ కూడా పూర్తైంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 61 లక్షల 74 వేల 161 మందికి వ్యాక్సినేషన్ అందింది. అందులో మొదటి డోస్‌ పూర్తైన వారు 48 లక్షల 99 వేల 718 మంది. రెండో డోస్‌ పూర్తైన వారు 12 లక్షల74 వేల 443 మంది.

ఇక ఏ కంపెనీ వ్యాక్సిన్లు ఎన్ని అందాయనే వివరాలు గమనిస్తే.. 19 కోట్ల 8 లక్షల 42 వేల 484 మందికి covisheild అందితే.. 2 కోట్ల 40 లక్షల 17 వేల 539 మందికి covaxine వ్యాక్సిన్లు అందాయి.

వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నంటున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. దేశంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి సంఖ్య 25 కోట్లు దాటింది. ఆ వివరాలు చూస్తే.. 25 కోట్ల 23 లక్షల 34 వేల 615 మంది వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందులో 10 కోట్ల 42 వేల 462 మంది.. 18 నుంచి 44 ఏళ్ల మధ్య గ్రూప్ వారు అయితే.. 15 కోట్ల 22 లక్షల 92 వేల 153 మంది 45 ఏళ్ల పై బడిన వారు.

Covid Vaccine

Covid Vaccine

అందరికి వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం. టీవీ9 నినాదం.. దేశం విధానం…

Read Also….  CM KCR Review: రాష్ట్రంలో భూముల కిరికిరి ఉండకూడదు.. తెలంగాణ‌ భూముల స‌మ‌గ్ర సర్వేపై సీఎం కేసీఆర్ సమీక్ష

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!