CM KCR Review: రాష్ట్రంలో భూముల కిరికిరి ఉండకూడదు.. తెలంగాణ‌ భూముల స‌మ‌గ్ర సర్వేపై సీఎం కేసీఆర్ సమీక్ష

కొత్త రెవెన్యూ యాక్ట్‌‌తో ఇకపై రాష్ట్రంలో భూముల కిరికిరి ఉండకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ అన్నారు. రాష్ట్రంలోని భూములను ప్రతి ఇంచూ కొలుస్తామని చెప్పారు.

CM KCR Review: రాష్ట్రంలో భూముల కిరికిరి ఉండకూడదు.. తెలంగాణ‌ భూముల స‌మ‌గ్ర సర్వేపై సీఎం కేసీఆర్ సమీక్ష
Cm Kcr Review On Land Survey
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 02, 2021 | 2:53 PM

CM KCR Review on Land Survey: కొత్త రెవెన్యూ యాక్ట్‌‌తో ఇకపై రాష్ట్రంలో భూముల కిరికిరి ఉండకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ అన్నారు. రాష్ట్రంలోని భూములను ప్రతి ఇంచూ కొలుస్తామని చెప్పారు. డిజిటల్‌‌ సర్వే చేయించి అక్షాంశాలు, రేఖాంశాలతో కూడిన సరిహద్దులతో పాస్‌‌బుక్‌‌లు ఇస్తామని సీఎం కేసీఆర్ ఇది వరకే ప్రకటించారు. ఇదే క్రమంలో పనులు వేగవంతం చేసేందుకు కసరత్తు మొదలు పెట్టారు. ఇందులో భాగంగా తెలంగాణ‌లోని భూముల స‌మ‌గ్ర సర్వేపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో ఉన్నత‌స్థాయి స‌మీక్ష నిర్వహించారు. సీఎస్ సోమేశ్‌కుమార్, ఐటీ, స్టాంపులు, రిజిస్ట్రేష‌న్లు, ఆర్థిక, రెవెన్యూ, స‌ర్వే అధికారుల‌తో పాటు వివిధ సంస్థల ప్రతినిధుల‌తో సీఎం స‌మావేశ‌మ‌య్యారు.

తెలంగాణ వ్యాప్తంగా భూముల డిజిట‌ల్ స‌ర్వే చేసేందుకు ఆస‌క్తి క‌న‌బ‌రిచిన వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ప్రతినిధులు కూడా స‌మావేశానికి హాజ‌ర‌య్యారు. ఆయా కంపెనీల ప్రతినిధుల‌తో ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి సోమేశ్‌కుమార్ నిన్నే ప్రాథ‌మికంగా స‌మావేశ‌మై స‌ర్వే సంబంధిత అంశాల‌పై చ‌ర్చించారు.

భ‌విష్యత్తులో భూత‌గాదాలు లేకుండా శాశ్వత ప‌రిష్కార‌మే ధ్యేయంగా రాష్ట్రంలోని భూముల‌న్నింటినీ స‌మ‌గ్రంగా స‌ర్వే చేయాల‌ని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించేందుకు టెండర్లను పిలిచి పనులు అప్పగిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇందుకు అందుక‌నుగుణంగా బ‌డ్జెట్‌లో స‌ర్వే కోసం రూ.400 కోట్లు కేటాయించారు. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థ‌ల స‌హ‌కారంతో వీలైనంత త్వరగా స‌ర్వే పూర్తి చేయాల‌ని రాష్ట్ర ప్రభుత్వం ల‌క్ష్యంగా పెట్టుకుంది.

Read Also…  CM Jagan: భూ సర్వే చురుగ్గా ముంద‌కు సాగాలి.. అధికారుల‌కు సీఎం జ‌గ‌న్ కీల‌క ఆదేశాలు

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!