Covid 19 Omicron: ఓమిక్రాన్ వేరియంట్ భయాందోళనలు.. జపాన్ సంచలన నిర్ణయం!
కరోనావైరస్ కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ముప్పును దృష్టిలో ఉంచుకుని అన్ని దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ఈనేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న విదేశీ ప్రయాణికులందరి ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్లు జపాన్ సోమవారం ప్రకటించింది.
Japan on Covid 19 Omicron spreads: కరోనావైరస్ కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ముప్పును దృష్టిలో ఉంచుకుని అన్ని దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ఈనేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న విదేశీ ప్రయాణికులందరి ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్లు జపాన్ సోమవారం ప్రకటించింది. ఈ ప్రకటన మంగళవారం నుంచి అమల్లోకి వస్తుందని ఆ దేశ ప్రధాని ఫుమియో కిషిడా తెలిపారు. ప్రకటన అంటే జపాన్ తన సరిహద్దులో ప్రజల కదలికలపై నియంత్రణలను పునరుద్ధరిస్తుందని, ఈ నెల ప్రారంభంలో స్వల్పకాలిక వ్యాపార ప్రయాణికులు, విదేశీ విద్యార్థులు, కార్మికుల కోసం సడలింపు ఉంటుందని పుమియో వెల్లడించారు.
దక్షిణాఫ్రికాలో బయటపడ్డ కొత్త వేరియంట్ ప్రభావంతో ఇప్పటికే ఎనిమిది దేశాల నుండి వచ్చే ప్రయాణికుల ప్రవేశంపై జపాన్ ఆంక్షలను కఠినతరం చేసింది. ఇందులో భాగంగా ఈ దేశాల నుండి వచ్చే ప్రయాణికులు ప్రభుత్వం గుర్తించిన కేంద్రాలలో 10 రోజుల పాటు నిర్బంధంలో ఉండాల్సి ఉంటుంది. కరోనావైరస్ కొత్త ఓమిక్రాన్ వేరియంట్‌ల ముప్పు దృష్ట్యా, చాలా దేశాలు సరిహద్దులో ఆంక్షలను కఠినతరం చేశాయి. అనుమానాస్పద ఓమిక్రాన్ కేసులకు గురైన వ్యక్తులు టీకాలు వేసినప్పటికీ, 10 రోజుల పాటు స్వీయ-ఒంటరిగా ఉండవలసి ఉంటుందని బ్రిటన్ తెలిపింది. మరోవైపు బంగ్లాదేశ్, శ్రీలంక, బ్రిటన్, అమెరికా వంటి దేశాలు ట్రావెల్ బ్యాన్‌లు విధించడం ప్రారంభించాయి.
Omicron వేరియంట్ దక్షిణాఫ్రికాలో కొన్ని రోజుల క్రితం వెలుగుచూసింది. ఈ వేరియంట్ గురించి ఇంకా ఎక్కువ సమాచారం లేనప్పటికీ, వేరియంట్‌పై మరింత అధ్యయనం జరుగుతోంది, తద్వారా ఈ వేరియంట్ ఎంతో వేగంగా వ్యాప్తి చెందే అంటువ్యాధిగా నిపుణులు చెబుతున్నారు. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ దానిపై ప్రభావవంతంగా ఉందో లేదో అనే దాని గురించి ఖచ్చితమైన సమాచారం లేదు. అయితే వీటన్నింటి మధ్య ప్రపంచ దేశాలు వేగంగా అడుగులు వేయడం ప్రారంభించాయి. ఇందులో దక్షిణాఫ్రికా దేశాలపై ప్రయాణ నిషేధం విధించడం మొదలు పెట్టాయి. మరోవైపు, ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల మందికి పైగా కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అటువంటి పరిస్థితిలో, ఈసారి ప్రభుత్వాలు ఈ కొత్త వేరియంట్ గురించి జాగ్రత్తగా చూస్తున్నాయి.
ఇదిలావుంటే, విదేశీయుల ప్రవేశాన్ని నిషేధించాలని ఇజ్రాయెల్ నిర్ణయించింది. అదే సమయంలో, సోమవారం నుండి రెండు వారాల పాటు దేశంలోకి వచ్చే అన్ని విమానాలను నిలిపివేస్తున్నట్లు మొరాకో తెలిపింది. హాంకాంగ్ నుండి యూరప్, యూరోప్ నుండి ఉత్తర అమెరికా వరకు అనేక ప్రదేశాల నుండి శాస్త్రవేత్తలు ఈ కొత్త వేరియంట్ రూపాంతరం ఉనికిని నిర్ధారించారు. నెదర్లాండ్స్‌లో ఆదివారం 13 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కెనడా, ఆస్ట్రేలియాలో రెండు కేసులు నమోదయ్యాయి. మరోవైపు, కొత్త వేరియంట్ పట్ల అంతగా భయపడాల్సిన పనిలేదని, విదేశీ సరిహద్దులను తెరిచి ఉంచాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కోరింది.