కరోనా పోరులో మరో ముందడుగు..గం. 32 టెస్టులు చేసే యంత్రం!

ప్రపంచ దేశాలకు కంటిమీద కనుకు లేకుండా చేస్తున్న ఉమ్మడి శత్రువు కరోనా మహమ్మారి. కరోనాపై పోరులో తాజాగా భారత కంపెనీలు మరో ముందడుగు వేశాయి. కరోనా టెస్టులకు సంబంధించిన కీలక యంత్రాన్ని ఆవిష్కరించాయి.

కరోనా పోరులో మరో ముందడుగు..గం. 32 టెస్టులు చేసే యంత్రం!
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 08, 2020 | 12:42 PM

ప్రపంచ దేశాలకు కంటిమీద కనుకు లేకుండా చేస్తున్న ఉమ్మడి శత్రువు కరోనా మహమ్మారి. దీనిని అంతం చేయగల సరైన వ్యాక్సిన్ తయారీలో అన్ని దేశాలతో పాటు భారత సైంటిస్టులు కూడా అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఇప్పటికే కొన్ని వ్యాక్సిన్ ‌లు క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించాయి. కోవిడ్‌పై పోరులో వ్యాక్సిన్లు, ఔషధాల తయారీకి కేంద్రమైన భారత్ కూడా ముందుంది. తాజాగా భారత కంపెనీలు మరో ముందడుగు వేశాయి. కరోనా టెస్టులకు సంబంధించిన కీలక యంత్రాన్ని ఆవిష్కరించాయి.

దేశంలో కరోనా వైరస్ విస్తరణ వాయువేగంగా పెరిగిపోతుండటం,.. టెస్ట్ కిట్ల సామర్థ్యానికి మించి లక్షణాలు కలిగిన బాధితులు ల్యాబులకు క్యూ కడుతున్న పరిస్థితుల్లో గంటకు 32 కోవిడ్ పరీక్షలు చేయగల స్వయంచాలక పరీక్షా యంత్రాన్ని (ఆటోమేటెడ్ టెస్టింగ్ మెషీన్) ఆవిష్కరించాయి. పుణెకు చెందిన మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్, సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ)లు సంయుక్తంగా ఈ అద్భుత యంత్రాన్ని అభివృద్ధి చేశాయి. అతి తక్కువ మానవ ప్రమేయంతో కరోనా టెస్ట్‌లను సాఫీగా చేయగల సామర్థ్యం ఈ యంత్రానికి ఉంది.

ఒక్క యంత్రం ద్వారా రోజుకు 400 శాంపిల్స్‌ని పరీక్షేంచే వీలుంటుందని తెలిపారు. ఇక ఈ యంత్రం వినియోగంలో ఒకే ఒక్క టెక్నీషియన్ ఉంటే సరిపోతుంది. ప్రస్తుతానికి రెండు రకాల టెస్టింగ్ యంత్రాలను తయారు చేశామని, వాటిలో పెద్ద దాని ధర రూ. 40 లక్షలని ఎస్ఐఐ సీఈవో అధర్ పూనావాలా వెల్లడించారు. ఇక ఈ ఆటోమేటెడ్ టెస్టింగ్ మెషీన్ అవరమైన వైద్య సంస్థలు, ల్యాబ్స్ యజమాన్యాలు ఈ నెల 13 నుంచి ముందుగానే బుక్ చేసుకోవాలని సూచించారు.