ఇండోర్‌లో కరోనా విలయ తాండవం..

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇప్పటి వరకే లక్షా అరవై వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసుల్లో పెద్ద ఎత్తున దేశంలోని పదమూడు పట్టణాల్లోనే నమోదవుతున్నట్లు తెలుస్తోంది. అందులో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ నగరం కూడా ఒకటిగా ఉన్నట్లు అర్ధమవుతోంది. ఇప్పటికే ఇక్కడ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మూడు వేల మార్క్‌ను చేరుకుంది. తాజాగా.. శుక్రవారం నాడు.. కొత్తగా 84 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. […]

  • Tv9 Telugu
  • Publish Date - 8:07 pm, Fri, 29 May 20
ఇండోర్‌లో కరోనా విలయ తాండవం..

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇప్పటి వరకే లక్షా అరవై వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసుల్లో పెద్ద ఎత్తున దేశంలోని పదమూడు పట్టణాల్లోనే నమోదవుతున్నట్లు తెలుస్తోంది. అందులో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ నగరం కూడా ఒకటిగా ఉన్నట్లు అర్ధమవుతోంది. ఇప్పటికే ఇక్కడ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మూడు వేల మార్క్‌ను చేరుకుంది. తాజాగా.. శుక్రవారం నాడు.. కొత్తగా 84 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో ఇండోర్‌లో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3,344కు చేరింది. ఇక ఇక్కడ ఇప్పటి వరకు కరోనా బారినపడి 136 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో నలుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు.