AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ దేశంలో కరోనా పెషెంట్స్ లేరంటా..!

ప్రపంచవ్యాప్తంగా నానాటికీ కేసుల సంఖ్య పెరుగుతుంటే డేంజ‌ర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఇలాంటి సమయంలో న్యూజిలాండ్‌ దేశం శుభ‌వార్త తెలిపింది. క‌రోనా నుంచి కోలుకున్న చివ‌రి బాధితుడిని ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ చేసిన‌ట్లు వెల్ల‌డించింది. కాగా న్యూజిలాండ్ దేశంలో గ‌త వారం రోజులుగా ఒక్క క‌రోనా కేసు కూడా న‌మోదు కాలేద‌ని అక్క‌డి అధికారులు వెల్ల‌డించారు. ఇందులో భాగంగా బుధ‌వారం క‌రోనా బారి నుంచి బ‌య‌ట‌ప‌డ్డ‌ చిట్ట‌చివ‌రి పేషెంట్‌ను ఆక్లండ్‌లోని మిడిల్‌మోర్ ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. న్యూజిలాండ్ […]

ఆ దేశంలో కరోనా పెషెంట్స్ లేరంటా..!
Balaraju Goud
|

Updated on: May 29, 2020 | 8:36 PM

Share

ప్రపంచవ్యాప్తంగా నానాటికీ కేసుల సంఖ్య పెరుగుతుంటే డేంజ‌ర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఇలాంటి సమయంలో న్యూజిలాండ్‌ దేశం శుభ‌వార్త తెలిపింది. క‌రోనా నుంచి కోలుకున్న చివ‌రి బాధితుడిని ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ చేసిన‌ట్లు వెల్ల‌డించింది. కాగా న్యూజిలాండ్ దేశంలో గ‌త వారం రోజులుగా ఒక్క క‌రోనా కేసు కూడా న‌మోదు కాలేద‌ని అక్క‌డి అధికారులు వెల్ల‌డించారు. ఇందులో భాగంగా బుధ‌వారం క‌రోనా బారి నుంచి బ‌య‌ట‌ప‌డ్డ‌ చిట్ట‌చివ‌రి పేషెంట్‌ను ఆక్లండ్‌లోని మిడిల్‌మోర్ ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. న్యూజిలాండ్ ప్ర‌ధాని జెసిండా ఆర్డ‌న్స్ అనుసరించిన విధివిధానాలు, ఆమె సమ‌ర్థ‌వంత‌మైన నాయ‌కత్వమే ప్రాణాంత‌క వైర‌స్‌తో సాగిన పోరాటంలో గెలుపుకు కార‌ణ‌మైంద‌ని ప్ర‌జ‌లు ఆమెకు జేజేలు ప‌లుకుతున్నారు. ఆ దేశంలో ఆరు కరోనా కేసులు న‌మోద‌వ‌గానే దేశ ప్ర‌జ‌లంద‌రూ రెండు వారాల‌పాటు సెల్ఫ్ ఐసోలేట్‌లో ఉండాల‌ని ప్రధాని జెసిండా పిలుపునిచ్చారు. బాధితుల సంఖ్య 28కు చేరుకునే స‌మ‌యానికి విదేశాల నుంచి రాక‌పోక‌ల‌పై నిషేధం విధించారు. అంతేకాక దేశంలో 2,67,435 క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించడం విశేషం. ఇప్ప‌టివ‌ర‌కు అక్క‌డ 1504 కేసులు న‌మోద‌వ‌గా 22 మంది చ‌నిపోయారు, మిగ‌తా అంద‌రూ కోలుకున్నారు.

ఈ రాశుల వారికి మౌనీ అమావాస్యతో ఆ గండం తప్పినట్లే.. ఇక నుంచి లక్కు
ఈ రాశుల వారికి మౌనీ అమావాస్యతో ఆ గండం తప్పినట్లే.. ఇక నుంచి లక్కు
మకర సంక్రాంతి రోజు మటన్ ముట్టకూడదా? పండితులు ఏమంటున్నారంటే?
మకర సంక్రాంతి రోజు మటన్ ముట్టకూడదా? పండితులు ఏమంటున్నారంటే?
ఏపీలో మరో కొత్త పథకం ప్రారంభం.. ప్రతీఒక్కరి అకౌంట్లోకి రూ.10 వేలు
ఏపీలో మరో కొత్త పథకం ప్రారంభం.. ప్రతీఒక్కరి అకౌంట్లోకి రూ.10 వేలు
సంక్రాంతి ఎప్పుడు? జనవరి 14 లేదా 15? ఇలా మీరే నిర్ణయించుకోండి
సంక్రాంతి ఎప్పుడు? జనవరి 14 లేదా 15? ఇలా మీరే నిర్ణయించుకోండి
ఒకే దెబ్బకు కోహ్లీ, గిల్ రికార్డులు క్లోజ్.. వైభవ్ మాములోడు కాదు
ఒకే దెబ్బకు కోహ్లీ, గిల్ రికార్డులు క్లోజ్.. వైభవ్ మాములోడు కాదు
'పరాశక్తి' సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోలు ఎవరో తెలుసా?
'పరాశక్తి' సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోలు ఎవరో తెలుసా?
చిక్కుడులా కనిపించే అనపకాయ గింజలతో అద్భుతమైన ఆరోగ్యం! పోషకాల నిధి
చిక్కుడులా కనిపించే అనపకాయ గింజలతో అద్భుతమైన ఆరోగ్యం! పోషకాల నిధి
కారులో ఆ పాడు సీన్‌ పై రచ్చ.. డిలీట్ చేయాలంటూ డిమాండ్
కారులో ఆ పాడు సీన్‌ పై రచ్చ.. డిలీట్ చేయాలంటూ డిమాండ్
ప్రపంచ యాత్రను ఆపేస్తున్నా... యూట్యూబర్ నా అన్వేషణ..
ప్రపంచ యాత్రను ఆపేస్తున్నా... యూట్యూబర్ నా అన్వేషణ..
మీ రోగాలన్నింటికీ సర్వరోగ నివారణి తిప్ప తీగ కషాయం
మీ రోగాలన్నింటికీ సర్వరోగ నివారణి తిప్ప తీగ కషాయం