AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సోషల్ మీడియాపై ట్రంప్ అన్నంత పని చేశాడు..!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి కోపమొచ్చింది. కొద్దిరోజులుగా సోషల్ మీడియాపై విరుచుకుపడ్డ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సామాజిక మాధ్యమ సంస్థలకు ఇప్పటివరకు ఉన్న చట్టపరమైన రక్షణలను తొలగించే ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంతకం చేశారు. సామాజిక మాధ్యమ సంస్థలు ఆన్‌లైన్‌ కంటెంటును తనిఖీ చేస్తే చర్యలు తీసుకునేలా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆర్డర్‌ ద్వారా సర్వీస్‌ ప్రొవైడర్ల నిబంధనల ప్రకారం, ఏ రకమైన కంటెంట్ నిరోధాన్ని మోసపూరితమైందిగా లేదా అస్థిరమైందిగా […]

సోషల్ మీడియాపై ట్రంప్ అన్నంత పని చేశాడు..!
Balaraju Goud
|

Updated on: May 29, 2020 | 8:30 PM

Share

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి కోపమొచ్చింది. కొద్దిరోజులుగా సోషల్ మీడియాపై విరుచుకుపడ్డ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సామాజిక మాధ్యమ సంస్థలకు ఇప్పటివరకు ఉన్న చట్టపరమైన రక్షణలను తొలగించే ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంతకం చేశారు. సామాజిక మాధ్యమ సంస్థలు ఆన్‌లైన్‌ కంటెంటును తనిఖీ చేస్తే చర్యలు తీసుకునేలా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆర్డర్‌ ద్వారా సర్వీస్‌ ప్రొవైడర్ల నిబంధనల ప్రకారం, ఏ రకమైన కంటెంట్ నిరోధాన్ని మోసపూరితమైందిగా లేదా అస్థిరమైందిగా పరిగణిస్తారో తెలపాలని ఫెడరల్‌ కమ్యూనికేషన్‌ కమిషన్‌(ఎఫ్‌సీసీ)ని కోరింది. ఈ మధ్యే డొనాల్డ్‌ ట్రంప్‌ ట్విటర్‌లో చేసిన కామెంట్‌పై ట్విటర్‌ ఫ్యాక్ట్‌చెక్‌ చేపట్టడాన్ని ట్రంప్‌ తీవ్రంగా పరిగణించారు. అంతేకాకుండా, సోషల్‌ మీడియాపై చర్యలు ఉంటాయని హెచ్చరించిన కొన్ని గంటల్లోనే ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్ పై సంతకం చేశారు ట్రంప్. అమెరికా ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛను రక్షించేందుకే ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ ఉపయోగపడుతుందని ట్రంప్‌. వెల్లడించారు. ‘వ్యక్తుల లేదా గ్రూపుల మధ్య జరిగే చర్చలను మార్పు చేయడం, తొలగించడం, దాచి పెట్టడం, నియంత్రించడం వంటి విశేష అధికారాలు ఈ టెక్నాలజీ కంపెనీలకు ఉంటాయని.. భవిష్యత్తులో దీన్ని పునరావృతం కానివ్వమన్నారు డొనాల్డ్‌ ట్రంప్‌.

ఒకవేళ ఇది చట్టంగా మారితే మాత్రం సామాజిక మాధ్యమాలను కూడా ప్రచురణకర్తలుగానే పరిగణించే అవకాశముంది. అంతేకాకుండా సోషల్‌ మీడియా వేదికలపై యూజర్లు వెల్లడించే విషయాలకు సదరు కంపెనీనే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో వ్యక్తులు చేసే కామెంట్లకు సదరు వెబ్‌సైట్‌ లేదా సోషల్‌ మీడియా సంస్థలు 1996 చట్టం ప్రకారం బాధ్యత వహించవు. తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఇక సోషల్‌ మీడియా సంస్థలు ఈ స్వేచ్ఛను కోల్పోయే అవకాశం ఉంది. అయితే, ట్రంప్‌ తీసుకున్న నిర్ణయంపై పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సెక్షన్‌ 230 ప్రకారం ప్రైవేటు ఇంటర్నెట్‌ ఆపరేటర్లను నియంత్రించే అధికారం ట్రంప్‌కు లేదంటున్నారు. ఇది సోషల్ మీడియా కంపెనీలపై కఠినమైన, రాజ్యాంగ విరుద్ధమైన చర్యగా అమెరికన్‌ సివిల్‌ లిబర్టీస్‌ యూనియన్‌ అభిప్రాయపడింది.