భారత్‌లో 5 వేలు దాటిన కరోనా మరణాలు..

భారత్‌లో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇక గడిచిన 24 గంటల్లో ఏకంగా 8,380 కేసులు నమోదు కాగా.. వైరస్ కారణంగా 193 మంది మృతి చెందారు. దీనితో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,82,143కి చేరినట్లు తాజా బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. అంతేకాక ఇప్పటివరకు దేశంలో ఒక్క రోజులో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. కాగా, 86,963 మంది కరోనా నుంచి […]

  • Publish Date - 11:44 am, Sun, 31 May 20
భారత్‌లో 5 వేలు దాటిన కరోనా మరణాలు..

భారత్‌లో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇక గడిచిన 24 గంటల్లో ఏకంగా 8,380 కేసులు నమోదు కాగా.. వైరస్ కారణంగా 193 మంది మృతి చెందారు. దీనితో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,82,143కి చేరినట్లు తాజా బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. అంతేకాక ఇప్పటివరకు దేశంలో ఒక్క రోజులో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. కాగా, 86,963 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా.. 89,995 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అటు 5,164 మంది వైరస్ బారిన పడి మరణించారు.

ఇదిలా ఉంటే దేశంలో మహారాష్ట్రలో కరోనా విలయం సృష్టిస్తోంది. ఈ రాష్ట్రంలోనే అత్యధిక కేసులు(65168), మరణాలు(2197) సంభవించాయి. ఆ తర్వాత తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా చాప కింద నీరులా విస్తరిస్తోంది. అయితే భారత్‌లో రికవరీ రేటు పెరుగుతుండటంతో ప్రజలు కాస్త ఊరట కలిగిస్తోంది.